ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నేర చరిత్ర 48 గంటల్లో వెల్లడించాలి: సుప్రీం కీలక తీర్పు

By narsimha lodeFirst Published Aug 10, 2021, 1:21 PM IST
Highlights


ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు 48 గంటల్లో నేరచరిత్రను బయటపెట్టాలని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. నేరచరిత్ర ఉన్న అభ్యర్ధులను ఎందుకు ఎంచుకొన్నారో కూడ చెప్పాలని ఉన్నత న్యాయస్థానం కోరింది.


న్యూఢిల్లీ: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల నేరచరిత్రను 48 గంటల్లోపుగా వెల్లడించాలని రాజకీయపార్టీలను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎన్నికల్లో  పోటీ చేసే అభ్యర్ధులను ప్రకటించే పార్టీలు 48 గంటల్లో వారి నేరచరిత్రను కూడ బయటపెట్టాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.ఈ విషయమై మంగళవారం నాడు సుప్రీంకోర్టు కీలకమైన తీర్పు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడాన్ని నిరోధించేందుకు హైకోర్టు ఆమోదం లేకుండా ఎమ్మెల్యేలు, ఎంపీలపై క్రిమినల్ కేసుల్ని ఉపసంహరించడం వీలుకాదని తెలిపింది. బీహార్ ఎన్నికలకు సంబంధించి గతంలోనూ ఈ తరహా తీర్పు వచ్చింది.

also read:కోర్టుల విచారణపై విశ్వాసం ఉంచాలి, సోషల్ మీడియాలో చర్చలా?: సీజేఐ కీలక వ్యాఖ్యలు

నేర చరిత్ర ఉన్న అభ్యర్ధులను పార్టీలు ఎందుకు ఎంపిక చేసుకొంటున్నాయో బహిర్గతం చేయాలని కూడ ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసుల వివరాలను వెబ్‌సైట్లో పొందుపర్చాలని కోరింది కోర్టు.కోర్టు ఆదేశాలను పాటించనందుకు గాను సీపీఐఎం, ఎన్సీపీ లు కోర్టుకు క్షమాపణలు చెప్పాయి. అలాగే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఈ పార్టీల గుర్తుల్ని నిలిపివేస్తామని ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.
 

click me!