కోర్టుల విచారణపై విశ్వాసం ఉంచాలి, సోషల్ మీడియాలో చర్చలా?: సీజేఐ కీలక వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Aug 10, 2021, 12:47 PM IST
Highlights

 పెగాసెస్ పై సుప్రీం కోర్టులో మంగళవారం నాడు విచారణ జరిగింది. సోషల్ మీడియాలో సమాంతర చర్చలపై ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యలు చేశారు. కోర్టుల్లో జరిగే విచారణపై పూర్తి విశ్వాసం ఉంచాలని ఆయన కోరారు.

న్యూఢిల్లీ: కోర్టుల్లో జరిగే విచారణలపై  పూర్తి విశ్వాసం ఉంచాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీరమణ చెప్పారు.పెగాసెస్ అంశంపై మంగళవారం నాడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.పెగాసెస్ పై కోర్టులో విచారణ సాగుతున్న సమయంలో ఇతర మాథ్యమాల వేదికగా సమాంతరంగా చర్చలు జరగడం దురదృష్టకరమన్నారు. ఈ చర్చలకు తాము వ్యతిరేకంగా కాదని సీజేఐ వ్యాఖ్యానించారు.  కానీ, కోర్టులో  కేసు చర్చకు వచ్చినప్పుడు కోర్టుల్లోనే చర్చ జరగాలన్నారు.

ఎందుకు సమాంతర చర్చలు జరుగుతున్నాయి, మీరు మీడియాలో ఏది చెప్పినా  ఎలాంటి ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆయన అడిగారు. కోర్టుల్లో సరైన చర్చ జరగాలన్నారు.వాద, ప్రతివాదులు సమాచారపరంగా సహకరించాలి... ఏం చెప్పాలనుకొన్నా కోర్టులోనే చెప్పాలని సీజేఐ సూచించారు.పిటిషనర్లు చెప్పే విషయాలన్నీ అఫిడవిట్ రూపంలోనే ఉండాలని  కోరారు.సామాజిక మాధ్యమాల్లో చర్చలకు తావివ్వకుండా చూసుకొంటామని పిటిషనర్లు ఉన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చారు.పెగాసెస్ అంశంపై పిటిషనర్లు దాఖలు చేసిన పిటిషన్లు ఇవాళ తనకు అందాయని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టుకు చెప్పారు. ఈ విషయమై వాదించేందుకు తనకు శుక్రవారం వకు  సమయం ఇవ్వాలని ఉన్నత న్యాయస్తానాన్ని తుషార్ కోరారు.

గత వారంలో ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించింది. జర్నలిస్టులు ఎన్ .,రామ్, శశికుమార్, ఎడిటర్స్ గిల్డ్ సహా  9 పిటిషన్లను  విచారణకు స్వీకరించింది. ఈ విచారణ సమయంలో జర్నలిస్టులు, విపక్షనేతలను లక్ష్యంగా చేసుకొని ఈ సాఫ్ట్‌వేర్ ఉపయోగించారనే వార్థాకథనాలు సరైనవే అయితే అవి తీవ్రమైనవిగా ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.

జర్నలిస్ట్ ఎన్. రామ్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. అమెరికాలోని కాలిఫోర్నియా జిల్లా కోర్టు ఆదేశాలను సిబల్ ప్రస్తావించారు.ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్ఓ సంస్థ కు వ్యతిరేకంగా వాట్సాప్ దాఖలు చేసిన పిటిషన్ ను అమెరికా కోర్టు విందన్నారు. ధృవీకరించబడిన ప్రభుత్వాలకు మాత్రమే ఈ సాఫ్ట్‌వేర్ విక్రయిస్తామని ఎన్ఎస్ఓ కోర్టులో అఫిడవిట్ లో పేర్కొందని సిబల్ చెప్పారు.
ఈ పిటిషన్లపై విచారణను ఈ నెల 16వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.


 

click me!