జూలై 19 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు?

By narsimha lodeFirst Published Jun 29, 2021, 4:09 PM IST
Highlights

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను  ఈ ఏడాది జూలై  19 నుండి నిర్వహించాలని కేబినెట్ కమిటీ ఫర్ పార్లమెంటరీ అఫెర్స్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది.


న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను  ఈ ఏడాది జూలై  19 నుండి నిర్వహించాలని కేబినెట్ కమిటీ ఫర్ పార్లమెంటరీ అఫెర్స్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో ఈ కమిటీ పనిచేస్తోంది.ఈ ఏడాది జూలై 19 నుండి ఆగష్టు 13వ తేదీవరకు ఈ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయం కమిటీ సిఫారసు చేసింది. సీసీపీఏ కమిటీ గత వారంలో సమావేశమైంది. పార్లమెంట్ సమావేశాల నిర్వహణ తేదీ గురించి చర్చించారు. ప్రతిపాదిత తేదీలను  ప్రధాని  మోడీకి పంపారు. మోడీ నుండి ఈ తేదీలకు సంబంధించి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది.

20 రోజుల పని దినాలను నిర్వహించాలని యోచిస్తోంది. ఈ సమావేశాల్లో పలు కీలకమైన బిల్లులను తీసుకురావాలని కేంద్ర ప్భుత్వం తలపెట్టింది.కరోనాతో పాటు, రైతుల సమస్యలతో పాటు ఇతర అంశాలపై కేంద్రాన్ని విపక్షాలు నిలదీసేందుకు తమ అస్త్రాలను సిద్దం చేసుకొంటున్నాయి.

పార్లమెంట్ సిబ్బందికి ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకొన్నారు. మెజార్టీ సిబ్బందిలో కనీసం ఒక్క డోసైనా తీసుకొన్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకొన్నట్టుగా సర్టిఫికెట్ తీసుకొస్తేనే పార్లమెంట్ లోనికి అనుమతిచ్చేలా  నిబంధనలను తీసుకరావాలనే యోచనలో ఉన్నారు.ఎంపీలతో పాటు వారి కుటుంబసభ్యులకు కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ ను కూడ ప్లాన్ చేయనున్నారు.కేంద్ర బడ్జెట్ సమావేశాల సమయంలో  ఉభయ సభల్లో పది ఆర్డినెన్స్ లను తీసుకొచ్చింది కేంద్రం.

click me!