భారత్‌లో అందుబాటులోకి నాలుగో వ్యాక్సిన్... మోడెర్నా టీకాకు డీసీజీఐ అనుమతి

By Siva KodatiFirst Published Jun 29, 2021, 3:34 PM IST
Highlights

భారత్‌లో నాలుగో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ డీసీజీఐ మంగళవారం అనుమతించింది. ఇప్పటికే భారత్‌లో కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే.  
 

భారత్‌లో నాలుగో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికాకు చెందిన మోడెర్నా సంస్థ తయారు చేసిన వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతిస్తూ డీసీజీఐ మంగళవారం అనుమతించింది. ఇప్పటికే భారత్‌లో కోవిషీల్డ్, కొవాగ్జిన్, స్పుత్నిక్ వీలకు అనుమతి లభించిన సంగతి తెలిసిందే. మోడెర్నా వ్యాక్సిన్‌ను సిప్లా సంస్థ దిగుమతి చేసుకోనుంది.

మోడెర్నా డోసుల దిగుమతి, మార్కెటింగ్‌ అనుమతుల కోసం సిప్లా సంస్థ సోమవారం డీసీజీఐకి దరఖాస్తు చేసుకుంది. ఈ దరఖాస్తును పరిశీలించిన డీసీజీఐ.. మోడెర్నా టీకాకు పరిమితులతో కూడిన అత్యవసర వినియోగానికి ఆమోద ముద్ర వేసినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

మోడెర్నా టీకాను mRNA టెక్నాలజీతో అభివృద్ధి పరిచారు. క్లినికల్‌ ప్రయోగాల్లో 90 శాతానికి పైనే సమర్థత కనబర్చిన ఈ టీకాకు అమెరికాతో పాటు పలు అభివృద్ది చెందిన దేశాలు అత్యవసర అనుమతులు మంజూరు చేశాయి. మోడెర్నాతో పాటు ఫైజర్‌ టీకా కూడా అమెరికా, బ్రిటన్‌ తదితర దేశాల్లో అందుబాటులో ఉంది.

click me!