బీహార్ లో ఉద్రిక్తత: టెట్ అభ్యర్ధుల ఆందోళన, లాఠీచార్జీ

By narsimha lodeFirst Published Jun 29, 2021, 3:32 PM IST
Highlights

బీహార్ రాష్ట్రంలో టె్ట్  అభ్యర్ధుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యాశాఖ మంత్రి ఇంటి  ముట్టడికి ప్రయత్నించిన టెట్ అభ్యర్ధులపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. 


పాట్నా: బీహార్ రాష్ట్రంలో టె్ట్  అభ్యర్ధుల ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. విద్యాశాఖ మంత్రి ఇంటి  ముట్టడికి ప్రయత్నించిన టెట్ అభ్యర్ధులపై పోలీసులు లాఠీచార్జీకి దిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని టెట్ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. మంత్రి నివాసంలో చొచ్చకుకు వెళ్లేందుకు ప్రయత్నించిన అభ్యర్ధులపై పోలీసులు లాఠీచార్జీ చేశారు.  ఆందోళనకారులను దొరికినవారిని దొరికనట్టే పోలీసులు చితకబాదారు.  పోలీసులనుండి తప్పించుకొనే క్రమంలో అభ్యర్దులు  పారిపోతున్న సమయంలో ఒకరిపై మరొకరు పడిపోయారు. 

విద్యాశాఖ మంత్రి  విజయ్ కుమార్ చౌదరి ఇంటి ముందు టెట్ అభ్యర్ధులు ఆందోళనకు ప్రయత్నించారు. గత ఏడాది డిసెంబర్ మాసంలో టెట్ పరీక్షను అభ్యర్ధులు పాసయ్యారు. తమందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని అభ్యర్ధులు డిమాండ్ చేశారు.టెట్ అభ్యర్ధులు బీహార్ విపక్షనేత తేజస్వీ యాదవ్  ను కలిశారు. తేజస్వియాదవ్ ను కూడ కలిసి తమ డిమాండ్లను విన్పించారు. టెట్ అభ్యర్ధులకు ఉద్యోగాలు కల్పించాలని ఆయన కోరారు. టెట్ అభ్యర్ధులపై లాఠీచార్జీ చేయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం ఏమి చేయడం లేదని తేజస్వియాదవ్ విమర్శించారు. తమ హక్కుల కోసం ప్రశ్నించిన విద్యార్ధి, యువజనులపై లాఠీలతో బెదిరిస్తున్నాడని తేజస్వియాదవ్ విమర్శించారు.


 

click me!