ట్విట్టర్‌కి షాక్: పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమన్లు

By narsimha lodeFirst Published Jun 15, 2021, 12:29 PM IST
Highlights

ఈ నెల 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని ట్విట్టర్‌కు  సమాచార, టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.

న్యూఢిల్లీ: ఈ నెల 18వ తేదీన తమ ముందు హాజరు కావాలని ట్విట్టర్‌కు  సమాచార, టెక్నాలజీపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మంగళవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.ఈ నెల 18న సాయంత్రం 4 గంటలకు పార్లమెంట్ కాంప్లెక్స్ లోని ప్యానెల్ ముందు హాజరు కావాలని కమిటీ ఆదేశించింది.సోషల్ మీడియాలో తప్పుడు వార్తల ప్రచారం, సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా ఎలా వ్యవహరిస్తారో  చెప్పాలని కోరింది. కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. ఈ విషయమై కేంద్రం ట్విట్టర్‌కు ఫైనల్ నోటీసు ఇచ్చింది. 

కేంద్ర ఐటీ మంత్రిత్వశాఖ నుండి పదే పదే లేఖలు అందినప్పటికీ కూడ ట్విట్టర్ నుండి సరైన స్పందన రాలేదు.   అయితే కొత్త ఐటీ రూల్స్ ను తాము పాటిస్తామని గత వారంలో ట్విట్టర్ హామీ  ఇచ్చింది. భారత్ తో తాము నిర్మాణాత్మక సంభాషణను కొనసాగిస్తామని ట్విట్టర్ ప్రతినిధి తెలిపారు. 

కొత్త ఐటీ నిబంధనలను పాటించడానికి ట్విట్టర్ కు ఉన్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తామని పార్లమెంటరీ కమిటీ ప్రకటించింది.దేశం రూపొందించిన నిబంధనలను అనుసరించడానికి ట్విట్టర్ కు ఏ పరిమితులు అడ్డుకొంటున్నాయో తాము తెలుసుకోవాలనుకొంటున్నామని పార్లమెంటరీ కమిటీ ప్యానెల్ సభ్యుడు మీడియా ఏజెన్సీకి తెలిపారు.


 

click me!