ఇండియాలో భారీగా తగ్గిన కేసులు : 95.43 శాతానికి చేరిన రికవరీ రేటు

Published : Jun 15, 2021, 10:36 AM IST
ఇండియాలో భారీగా తగ్గిన కేసులు : 95.43 శాతానికి చేరిన రికవరీ రేటు

సారాంశం

ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.  గత 24 గంటల్లో కరోనా కేసులు 60,471కి చేరుకొన్నాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 2,95,70,881కి చేరుకొన్నాయి. 

న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా కేసులు భారీగా తగ్గాయి.  గత 24 గంటల్లో కరోనా కేసులు 60,471కి చేరుకొన్నాయి. దీంతో దేశంలో కరోనా కేసులు 2,95,70,881కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లో 1,17,525 మంది కరోనా నుండి కోలుకొన్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా నుండి కోలుకొన్న వారి సంఖ్య 2.82 కోట్ల మంది కోలుకొన్నారు. కరోనా రికవరీ రేటు 95.43 శాతానికి చేరుకొంది.  దేశంలో కరోనా యాక్టివ్ కేసులు 1,17, 525కి చేరుకొన్నాయి. 

గత 24 గంటల్లో కరోనాతో  2726 మంది మరణించారు. ప్రస్తుతం కరోనాతో మరణించిన వారి సంఖ్య 3,77,031కి చేరుకొంది. వారం రోజులుగా దేశంలో కరోనా కేసులు లక్షకు దిగువన నమోదౌతున్నాయి.  కరోనా పాజిటివిటీ  రేటు 3.45 శాతానికి తగ్గిపోయింది.  దేశంలోని పలు రాష్ట్రాల్లో విధించిన లాక్‌డౌన్ మంచి ఫలితాలను అందించింది. లాక్‌డౌన్ కారణంగా ఆయా రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా తగ్గాయి.  చాలా రాష్ట్రాలు అన్‌లాక్ ప్రక్రియను చేపట్టాయి.


 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌