ఢిల్లీ అల్లర్ల కేసు.. ఆందోళన చేయడం ఉగ్రవాదం కాదు..!

By telugu news teamFirst Published Jun 15, 2021, 12:25 PM IST
Highlights

ఆందోళన చేయడం... ఉగ్రవాదం కాదని.. ఆ రెండింటికీ తేడా ఉందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం నిరసన చేసే హక్కు ఉందని.. అది  ఉగ్రవాద కార్యకలాపాల కిందకు రాదని కోర్టు పేర్కొంది.

ఆందోళన చేయడం.. ఉగ్రవాదం కాదని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. గతేడాది ఢిల్లీలో అల్లర్లు, హింస చెలరేగిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ హింసకు కారణం వీరేనంటూ ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. వారికి.. ఈ రోజు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

వారికి బెయిల్ మంజూరు చేస్తూ..  ఆందోళన చేయడం... ఉగ్రవాదం కాదని.. ఆ రెండింటికీ తేడా ఉందని కోర్టు పేర్కొంది. రాజ్యాంగం ప్రకారం నిరసన చేసే హక్కు ఉందని.. అది  ఉగ్రవాద కార్యకలాపాల కిందకు రాదని కోర్టు పేర్కొంది.

అల్లర్లు, హింస నేపథ్యంలో అరెస్టయిన పింజ్రా టాడ్ కార్యకర్తలు దేవాంగన కళిత, నటాషా నర్వల్‌, జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకూ ఢిల్లీ న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.

ఒక్కొక్కరికి 50 వేల రూపాయల పూచికత్తు, ఇద్దరు స్థానికులను సాక్షులుగా పేర్కొంటూ బెయిల్ పిటీషన్లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, హింసలకు పింజ్రా టాడ్ కార్యకర్తలే ప్రధాన కారణమంటూ అప్పట్లో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. 

వారిపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు. కోర్టు వీరిని కస్టడీకి తరలించగా.. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పటికి బెయిల్ మంజూరు అయ్యింది. 

click me!