కరుణకు పార్లమెంట్ నివాళి.. ఉభయసభలు రేపటికి వాయిదా

Published : Aug 08, 2018, 12:34 PM IST
కరుణకు పార్లమెంట్ నివాళి.. ఉభయసభలు రేపటికి వాయిదా

సారాంశం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి పార్లమెంట్ నివాళి అర్పించింది. ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు... అనంతరం సభ్యులంతా లేచి ఓ నిమిషం పాటు మౌనం పాటించారు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధికి పార్లమెంట్ నివాళి అర్పించింది. ఇవాళ ఉదయం లోక్‌సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ సుమిత్రా మహాజన్ సంతాప తీర్మానాన్ని చదివి వినిపించారు... అనంతరం సభ్యులంతా లేచి ఓ నిమిషం పాటు మౌనం పాటించారు.

మరోవైపు రాజ్యసభలోనూ ఛైర్మన్ వెంకయ్య నాయుడు కలైంజర్ సంతాప సందేశాన్ని చదివి వినిపించారు.. సభ్యులంతా ఆయనకు సంతాపం ప్రకటించి.. ఓ నిమిషం పాటు మౌనం పాటించారు. కరుణానిధికి గౌరవ సూచికంగా ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.. తిరిగి రేపు యధావిధిగా పార్లమెంట్ సమావేశమవుతుంది.
 

PREV
click me!

Recommended Stories

EPI 2024 లో అద్భుత ర్యాంకు సాధించిన యూపీ.. అసలు ఇదేమిటో తెలుసా?
Budget : ఆ ఒక్క బడ్జెట్ దేశ జాతకాన్నే మార్చేసింది.. డ్రీమ్ బడ్జెట్ అసలు కథ ఇదే !