లోక్‌సభ బీఏసీలో బీఆర్ఎస్ తొలగింపు: ఆహ్వానితుల జాబితాలోకి గులాబీ పార్టీ

Published : Mar 01, 2023, 12:19 PM ISTUpdated : Mar 01, 2023, 01:51 PM IST
 లోక్‌సభ బీఏసీలో  బీఆర్ఎస్  తొలగింపు: ఆహ్వానితుల జాబితాలోకి గులాబీ పార్టీ

సారాంశం

లోక్ సభ బీఏసీలో  బీఆర్ఎస్ ను ఆహ్వానితుల జాబితాలో  చేరుస్తూ  ఇవాళ పార్లమెంట్ బులెటిన్  విడుదల చేసింది. 

 హైదరాబాద్: లోక్‌సభ బీఏసీ లో కొన్ని మార్పులను చేస్తూ  బులెటిన్ విడుదలైంది.  బీఏసీలో   బీఆర్ఎస్ ను ఆహ్వానితుల జాబితాలో  చేర్చారు.  ఈ మేరకు  లోక్ సభ  బుధవారం నాడు బులెటిన్  విడుదల  చేసింది. లోక్ సభ  బీఏసీ  లో  మెంటర్   జాబితా  నుండి  ఆహ్వానితుల  జబితాలోకి  మార్చుతున్నట్టుగా  ఈ బులెటిన్  తెలిపింది. 

లోక్ సభ బీఏసీ  నుండి బీఆర్ఎస్ ను  తొలగించారు.  బీఆర్ఎస్ తరపున బీఏసీలో  నామా నాగేశ్వరరావు సభ్యుడిగా  ఉన్నారు. ఇవాళ బీఏసీ సమావేశానికి  బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు  ఆహ్వానితుడిగా సమాచారం పంపారు. లోక్ సభలో  ఆరుగురు సభ్యుల కంటే  ఎక్కువ మంది  ఎంపీలుంటే  బీఏసీలో  సభ్యత్వం ఉంటుంది. లోక్ సభలో  బీఆర్ఎస్ కు  9 మంది ఎంపీలున్నారు. అయితే  లోక్ సభ  బీఏసీలో  బీఆర్ఎస్ ను ఆహ్వానితుల జాబితాలో  చేర్చడం ప్రస్తుతం  చర్చకు దారి తీసింది.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

DMart : ఉద్యోగులకు డీమార్ట్ స్పెషల్ డిస్కౌంట్స్, బంపర్ ఆఫర్లు.. భారీగా డబ్బులు సేవ్..!
UPSC Interview Questions : మొబైల్, సెల్ ఫోన్ కి తేడా ఏమిటి..?