హీరో విజయ్ ఇంటిపై ఐటీ దాడులు: నోరు విప్పేందుకు బెంబేలు

By telugu team  |  First Published Feb 10, 2020, 12:57 PM IST

హీరో విజయ్ ఇంటిపై ఐటి దాడుల గురించి తమను ప్రశ్నించవద్దని తమిళనాడు మంత్రి శ్రీనివాసన్ అన్నారు. విజయ్ ఇంటిపై జరిగిన దాడుల మీద మాట్లాడవద్దని సీఎం పన్నీరు సెల్వం అదేశించినట్లు ఆయన తెలిపారు.


చెన్నై: హీరో విజయ్ నివాసంలో ఆదాయం పన్ను (ఐటి) దాడులపై మాట్లాడవద్దని తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం ఆదేశించినట్లు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాస్ చెప్పారు. అయితే, ఒక్కరికి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు తెలిపారు. మంత్రి జయకుమార్ తప్ప ఎవరు కూడా విజయ్ ఇంట్లో ఐటి తనిఖీలపై మాట్లాడవద్దని పన్నీరు సెల్వం హెచ్చరించినట్లు ఆయన తెలిపారు 

దిండుగల్ ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థులకు ఆనయ శనివారం ఉచిత ల్యాప్ టాప్ లను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. విద్యార్థులు దినపత్రికలు చదువుతూ అందులోని ముఖ్యమైన విషయాలను పాఠశాలలోని నోటీసు బోర్డుపై నమోదు చేయాలని సూచించారు.

Latest Videos

undefined

Also Read: హీరో విజయ్ కి ఐటీ సమన్లు.. విచారణకి రాలేనని చెప్పేశాడు!

కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హీరో విజయ్ ఇంట్లో ఐటి అధికారుల తనిఖీలకు బిజెపి కారణమని టిఎన్ సీసీ అధ్యక్షుడు అళగిరి ఆరోపిస్తున్నారని, మంత్రి రాజేంద్ర బాలాజీ కూడా బిజెపికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తున్నారని మీడియా ప్రతినిధులు గుర్తు చేసినప్పుడు అలాంటి విషయాలు తమను అడగవద్దని, మంత్రి జయకుమార్ తప్ప మిగతా ఎవరు కూడా మాట్లాడవద్దని సీఎం ఆదేశించారని శ్రీనివాసన్ చెప్పారు. 

Also Read: బ్యాగుల్లో కూడా పట్టనంత డబ్బు.. విజయ్, బిగిల్ ఫైనాన్సియర్ ఇంట్లో.

గ్రామాలకు మంచినీరు, రోడ్లు, వీధిలైట్ల వంటి పలు సమస్యలపై మాత్రమే తమను ప్రశ్నించాలని ఆయన చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

click me!