బరువు తగ్గడానికి ట్యాబ్లెట్స్ మింగిన డ్యాన్సర్.. కొద్దిసేపటికే..

By telugu team  |  First Published Feb 10, 2020, 7:50 AM IST

ఎలాగైనా బరువు తగ్గాలని మార్కెట్లో దొరికే కొన్ని మాత్రలను మింగింది.  సోమవారం సాయంత్రం జిమ్‌లో వర్కవుట్స్ చేసే ముందు ఈ పిల్‌ను వేసుకున్న మేఘన కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. 


బరువు తగ్గి అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ తాపత్రయపడతారు. అందుకోసం  చాలా మంది తిండి తినడం మానేస్తారు. ఇంకొందరేమో... జిమ్స్ లో గంటలు గంటలు గడిపేసి సన్నపడతారు. అయితే... ఓ మహిళా డ్యాన్స్ మాత్రం మందులు వాడి బరువు తగ్గాలని అనుకున్నారు. అదే ఆమె ప్రాణాలమీదకు వచ్చింది. ఈ సంఘటన థానేలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... థానేకు చెందిన మేఘన దేవ్ గడ్కర్(22) వృత్తిరిత్యా డ్యాన్సర్. శరీరాకృతి విషయంలో ఆమె చాలా జాగ్రత్తలు తీసుకునేది. బొద్దుగా ఉండే ఆమె రోజూ జిమ్ కు వెళ్లి బరువు తగ్గేందుకు కసరత్తులు చేసేది. అయితే... ఎన్ని కసరత్తులు చేసినా ఆమె బరువు పెద్దగా తగ్గలేదు.

Latest Videos

undefined

దీంతో.. ఆమె అసంతృప్తి చెందింది. ఎలాగైనా బరువు తగ్గాలని మార్కెట్లో దొరికే కొన్ని మాత్రలను మింగింది.  సోమవారం సాయంత్రం జిమ్‌లో వర్కవుట్స్ చేసే ముందు ఈ పిల్‌ను వేసుకున్న మేఘన కొద్ది గంటల్లోనే ప్రాణాలు కోల్పోయింది. 

Also Read ప్రేమ పెళ్లి.. వధువు కట్టుకున్న చీర చీప్ గా ఉందని..

ఫర్టిలైజర్స్, రంగులు, పేలుడు పదార్థాల తయారీలో వినియోగించే కెమికల్‌తో ఆ పిల్ తయారైందని.. ఆ పిల్ వేసుకుంటే శరీర ఉష్ణోగ్రత అమాంతం పెరుగుతుందని.. శరీరంలోని కొవ్వును కరిగించే క్రమంలో శరీర ఉష్ణోగ్రత విపరీతంగా పెరుగుతుందని.. ఆ పరిస్థితిలో మనిషి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. 

అందుకే ఆ పిల్‌ను నిషేధించారని పేర్కొన్నారు. ఆ పిల్ వేసుకున్న కొద్ది గంటల్లోనే వాంతులు, శరీర ఉష్ణోగ్రత పెరగడం, చెమటలు పట్టడం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయని, మేఘన కూడా ఆ విధంగానే ప్రాణాలు కోల్పోయిందని వివరించారు. మేఘనకు ఆ పిల్ ఎక్కడ నుంచి వచ్చిందన్న దానిపై ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు విచారణ జరుపుతున్నారు. 

ఆ డ్రగ్ పేరు మార్చి ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. అయితే.. మేఘన ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ ఇచ్చిందా లేక ఏదైనా మెడికల్ షాప్‌లో అనధికారికంగా విక్రయిస్తే కొనుక్కుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

click me!