
Indo-Pakistan Love Story: ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. అలా చెప్పడం అసలు సాధ్యం కాదు. అలాగే.. ప్రేమకు కులం, మతం, ప్రాంతం అనే బేదం ఉండదు. ప్రేమించిన వ్యక్తి సప్తసముద్రాల అవతల ఉన్నా వారి కోసం దాటే ప్రయత్నం కూడా చేస్తారు. ఒక్కటి కావాలనే చూస్తారు. తాజాగా ఓ ప్రేమికురాలు తాను ప్రేమించిన వ్యక్తి కోసం సరిహద్దులు దాటి.. పాకిస్థాన్ నుంచి ఇండియాకు వచ్చింది.
చావైన బతుకైనా తనతోనే అంటుంది. తాను ఎట్టి పరిస్థితిలోనూ పాకిస్థాన్ కు తిరిగి వెళ్లబోనని, ఇక్కడే (భారత్) జీవించాలనుకుంటోంది. ఆమెనే సీమా హైదర్. శనివారం జైలు నుండి విడుదలైన తర్వాత, ఆమె తన ప్రేమికుడు సచిన్‌తో కలిసి భారతదేశంలో ఉండటానికి అనుమతించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను అభ్యర్థించింది. పాకిస్థాన్‌కు వెళితే .. తాను మనుగడ సాధించలేనని చెప్పింది. అక్రమంగా భారత్‌లోకి ప్రవేశించినందుకు సీమాను జూలై 4న అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె భారతీయ ప్రేమికుడు సచిన్ , సచిన్ తండ్రిని కూడా అరెస్టు చేశారు.
ఓ న్యూస్ ఛానెల్ కి ఇంటర్వ్యూలో సీమా మాట్లాడుతూ.. సచిన్‌తో కలిసి భారతదేశంలో ఉండటానికి అనుమతించాలని సిఎం యోగి వేడుకుంది. ఎందుకంటే ఇప్పుడు పాకిస్తాన్‌కు వెళితే.. తనని చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పాకిస్థానీ భర్త గులాం హైదర్ వాదనలను కూడా ఆమె ఖండించింది, అతను తనను కొట్టేవాడని ఆరోపించింది. అంతే కాదు గులాం తన ముఖంపై కారం చల్లడం లాంటివి చేస్తూ తనను చిత్రహింసలకు గురిచేసేవాడని సీమ చెప్పింది.
తాను గత 4 సంవత్సరాలుగా గులామ్‌తో కలిసి జీవించడం లేదని, సచిన్ తన నలుగురి పిల్లలను దత్తత తీసుకున్నాడని, అందుకే ఇప్పుడు అతనితో కలిసి భారత్‌లో జీవించాలనుకుంటున్నానని సీమా పేర్కొంది. జూలై 4న సచిన్, అతని తండ్రి, సీమాలను అరెస్టు చేసి.. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. ముగ్గురూ శనివారం బెయిల్‌పై విడుదలయ్యారు.
PUBGతో ప్రేమ
ఇప్పుడూ .. సీమా హైదర్, సచిన్ మీనా ప్రేమకథ అందరి నోళ్లలో నానుతోంది. పాకిస్థాన్ చెందిన సీమా హైదర్, భారత్‌కు చెందిన సచిన్‌కు PUBG గేమింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారిద్దరూ తమ నంబర్‌లను మార్చుకున్నారు. తరుచు మాట్లాడుకోవడంతో వారి స్నేహం ప్రేమగా మారింది. ఇద్దరూ ఒక్కరినొక్కరూ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో సరిహద్దు నేపాల్ మీదుగా భారత్‌కు వచ్చింది. ఇక్కడికి రాకముందే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం సచిన్‌తో సీమా వివాహం జరిగింది. హిందూ మతాన్ని కూడా స్వీకరించారు. అయితే భారత్‌కు రాగానే ఆ రహస్యం బయటపడింది. తాజాగా సీమాను పోలీసులు అరెస్ట్ చేశారు. సీమాను పాక్ గూఢచారి అనే అనుమానంతో అరెస్టు చేశారు. అనంతరం బెయిల్‌పై విడుదలయ్యారు.
సీమా హైదర్‌కి ఇప్పటికే పెళ్లి.. పిల్లలు
పాకిస్థానీ మహిళ సీమా హైదర్‌కి ఇప్పటికే పెళ్లయింది. ఆమె భర్త పేరు గులాం హైదర్. సీమాకు గులాంకు చెందిన నలుగురు పిల్లలు. సీమకు మొదటి కుమారుడు 2015లో జన్మించాడు. గులాం హైదర్ సౌదీ అరేబియాలో పనిచేస్తున్నాడు. వారి కుటుంబం పాకిస్థాన్‌లోని కరాచీలో నివసిస్తోంది.సీమా భర్త నాలుగేళ్లుగా విదేశాల్లో ఉన్నాడు. గులామ్‌తో తాను అస్సలు కలిసి జీవించలేదనీ, తన పెళ్లి కూడా బలవంతంగా చేశారని వాపోయింది.
అతడు తనపై విచక్షణ రహితంగా దాడి.. తనపై కారం చల్లేవారని ఆరోపించింది. సీమ తన భర్తకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పింది. తాను ఆమె 2019 నుంచి భర్తతో విడివిడిగా జీవిస్తోన్నట్టు తెలిపింది. గులాం హైదర్ సౌదీ అరేబియాలో ఉన్నప్పుడు సచిన్‌తో స్నేహం ఏర్పడింది. ఇద్దరూ PUBG ప్లే చేస్తూ తమ నంబర్‌లను మార్చుకున్నారు. దీంతో వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.
నేపాల్‌లో తొలిసారి
సీమా ప్రకారం.. ఇద్దరూ 10 మార్చి 2023న నేపాల్‌లో మొదటిసారి కలుసుకున్నారు. టిక్కెట్టుతో ఆమె ఒంటరిగా నేపాల్ చేరుకుంది. సచిన్‌పై సీమాకు చాలా నమ్మకం ఉండేది. ఈ నమ్మకం వల్లే.. ఆమె ఈ నిర్ణయం తీసుకున్నది. సీమ మొదట కరాచీ నుంచి షార్జా చేరుకుంది. తర్వాత షార్జా నుంచి నేపాల్ వచ్చారు. సీమా నేపాల్ చేరకముందే సచిన్ అక్కడికి చేరుకున్నాడు. సీమాను కలిసినందుకు సచిన్ చాలా సంతోషంగా ఉన్నాడు. ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పలేకపోయాడు. ఇద్దరూ ఏడు రోజులు ఖాట్మండులో ఉన్నారు.
అప్పటి వరకు సీమ లాహోర్ వెళ్లిందని కుటుంబ సభ్యులకు తెలియదు. ఆమె తనతో పిల్లలను తీసుకురాలేదు. నేపాల్‌లోని పశుపతినాథ్ ఆలయంలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. తర్వాత మళ్లీ కలుస్తామని హామీ ఇవ్వడంతో ఇద్దరూ తమ తమ దేశాలకు వెళ్లిపోయారు. దీని తర్వాత సీమ ఒంటరిగా రాకూడదని, పిల్లలతో రావాలని నిర్ణయించుకుంది. మళ్లీ మేలో సీమ పిల్లలతో కలిసి నేపాల్ కు వచ్చింది. నేపాల్ సరిహద్దు దాటగానే సీమ ఆనందానికి అంతు లేకుండా పోయింది. సచిన్‌తో కలిసి భారత్‌కు వచ్చింది. ఇప్పుడు సీమ.. ఇండియాలో సెటిల్ అవ్వాలనుకుంటోంది.