ఘోరం.. దళిత బాలికలను అపహరించి.. వారం రోజులుగా పలుమార్లు అత్యాచారం..

By Asianet News  |  First Published Jul 9, 2023, 7:23 AM IST

ఇద్దరు దళిత బాలికలను నలుగురు కామాంధులు అపహరించారు. వారం రోజుల పాటు వారిని ఓ ఇంట్లో బంధీగా ఉంచారు. ఆ సమయంలో పలుమార్లు వారిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన జార్ఖండ్ లో జరిగింది. 


నేడు సమాజంలో మహిళలకు, చిన్నారులకు ఎక్కడా రక్షణ లేకుండా పోయింది. ఏదో సినిమాలో అన్నట్లు అమ్మ కడుపులో తప్ప మహిళలకు బయట సమాజంలో ఎక్కడా రక్షణ లభించడం లేదు. ఇంట్లో, స్కూళ్లో, ఆఫీస్ లో ఎక్కడ ఆమెకు రక్షణ దొరకడం లేదు. ఆమెకు లైంగిక వేధింపులు సాధారణమైపోయాయి. తాజాగా జార్ఖండ్ లోనూ ఇలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇద్దరు బాలికలను కిడ్నాప్ చేసి, వారం రోజుల పాటు అత్యాచారానికి ఒడిగట్టారు.

భర్తను పక్క గదిలో బంధించి.. భార్యపై 11 మంది సామూహిక అత్యాచారం

Latest Videos

వివరాలు ఇలా ఉన్నాయి. జార్ఖండ్ రాష్ట్రం లాతేహర్‌ జిల్లా బరవాడీహ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే ఇద్దరు దళిత బాలికలు కొంత కాలం నుంచి కనిపించడం లేదు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వెంటనే పోలీసులు యంత్రాంగం అప్రమత్తమైంది. ఆ జిల్లా ఎస్పీ దీనిపై విచారణ జరిపేందుకు సిట్ ను ఏర్పాటు చేశారు.

పశ్చిమ బెంగాల్ లో హింస.. పంచాయతీ ఎన్నికలు చెల్లవని ప్రకటించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్ నేత

అధికారులు బాలికల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాలికలను గార్వా ప్రాంతానికి చెందిన పలువురు దుండగులు కిడ్నాప్ చేశారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పెషల్ టీంలతో కలిసి దాడులు నిర్వహించారు. అనంతరం బాలికలను దుండగుల చెర నుంచి విడిపించారు. 

నాపై మూత్ర విసర్జన చేసిన వ్యక్తిని వదిలేయండి.. అతడు తప్పు తెలుసుకున్నాడు- ప్రభుత్వానికి బాధితుడి విజ్ఞప్తి

ఈ క్రమంలో పోలీసులతో బాధితులు పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడించారు. నలుగురు దుండుగులు తమను కిడ్నాప్ చేశారని చెప్పారు. వారం రోజుల పాటు తమను ఓ ఇంట్లో బంధించారని తెలిపారు. ఆ సమయంలో పలుమార్లు తమపై లైంగిక దోపిడికి పాల్పడ్డారని వాపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. దర్యాప్తు చేస్తున్నారు. 

click me!