తల్లే పేగు బంధాన్ని మార్చింది. ఇద్దరు కొడుకుల తలలు నరికింది.. ఎందుకంటే..?

Published : Apr 09, 2023, 02:46 PM IST
తల్లే పేగు బంధాన్ని మార్చింది. ఇద్దరు కొడుకుల తలలు నరికింది.. ఎందుకంటే..?

సారాంశం

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. ఓ కన్నతల్లి తన ఇద్దరు బిడ్డలను హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి ఆ చిన్నారుల తల, మొండెం వేరుగా పడున్నాయి. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నారు.

ఉత్తర్‌ప్రదేశ్‌లో దారుణం జరిగింది. కన్నతల్లే రక్తం పంచుకు పుట్టిన కన్న బిడ్డలను హతమార్చింది.  నవమాసాలు మోసి కనిపెంచిన తల్లే పేగు బంధాన్ని మార్చిపోయింది.  తన చేతులారా గొంతు కోసి హత్య చేసింది. అంతటితో ఆగకుండా ఆ చిన్నారుల తల, మొండెంను వేరు చేసింది. ఘటన అనంతరం ఆ తల్లి ఒకరి తలను మంచం తలపై.. మరొకరి తలను మరో గదిలో దాచిపెట్టింది. ఒక కొడుకు 9 సంవత్సరాలు కాగా.. మరొక కొడుకు 7 సంవత్సరాలు. 

వివరాలు ఇలా ఉన్నాయి.. గాజీపుర్‌ జిల్లాలోని హమీర్ పూర్ బిజౌర అనే గ్రామంలో అజిత్ యాదవ్, నీతు యాదవ్ దంపతులకు ముగ్గురు పిల్లలు. కుమార్తె పారీకి 9 ఏళ్లు. కుమారులు హ్యాపీకి 6 ఏండ్లు, హార్దిర్ కి 10 నెలలు. అజిత్ యాదవ్ ఆర్మీలో ఉన్నాడు. అతని పోస్టింగ్ జమ్మూ కాశ్మీర్‌లో . అతని భార్య నీతూ యాదవ్ (36) తన తల్లిదండ్రులతో ఉంటోంది. 

శుక్రవారం రాత్రి పిల్లలో కలిసి నిద్రించడానికి నీతు యాదవ్ తన గదిలోకి వెళ్లింది. అక్కడే ఉన్న చిన్నారులపై కత్తితో దాడి చేసింది. ఇద్దరూ కుమారుల అత్యంత దారుణంగా హత్య చేసి.. వారి తన తలలను వేరు చేసింది. ఈ క్రమంలో కుమార్తె పారీ ప్రాణాలతో బయటపడింది. ఉదయం మరిది గుర్తించడంతో కత్తితో గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. 

సమాచారం అందుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పలు పోలీస్ స్టేషన్ బలగాలు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. శనివారం సాయంత్రం తండ్రి ఇంటికి చేరుకుని కుమారులిద్దరూ అంత్యక్రియలు నిర్వహించారు.ఈ ఘటన మర్దాహా పోలీస్ స్టేషన్ పరిధిలోని హమీర్‌పూర్ గ్రామంలో జరిగింది.

ఈ విషాదంపై బాధితుల తాత రామ్ బచన్ యాదవ్ మాట్లాడుతూ.. ప్రజలందరూ కలిసి డిన్నర్ చేసి రాత్రి నిద్రకు ఉపక్రమించారు. నీతు కూడా గదిలో ముగ్గురు పిల్లలతో నిద్రకు ఉపక్రమించింది.

అత్తయ్య మాట్లాడుతూ..‘‘కోడలు నీతు మనవళ్లు హార్దిక్‌, హ్యాపీలను రాత్రి గొంతు కోసి హత్య చేసింది. శనివారం ఉదయం పిల్లలు కనిపించకపోవడంతో పిల్లల గురించి అడిగాను.. ఆవిడ పిల్లలిద్దరినీ చంపేసిందని..సమాధానంగా ఆమె చెప్పింది. ఈ క్రమంలో కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించింది. పక్కింటి వారు వచ్చి.. ఆమెను గదిలో బంధించారు.

మహిళ తన ఇద్దరు పిల్లలను గొంతు కోసి హత్య చేసిందని ఎస్పీ తెలిపారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళ మానసికంగా ఆందోళనకు గురైంది. ఆమెకు చికిత్స కూడా కొనసాగుతోంది. భర్త జమ్మూ కాశ్మీర్‌లో ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. వారికి సమాచారం అందించారు. సంభాషణలో స్త్రీ మానసికంగా బలహీనంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆమెను విచారిస్తున్నారు. భర్త రాకపై చర్యలు తీసుకుంటారు.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?