కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్.. తిప్పికొట్టిన భార‌త్  

By Rajesh KFirst Published Sep 6, 2022, 2:02 PM IST
Highlights

జమ్మూ జిల్లాలోని ఆర్నియా సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దు (IB) వెంట జరిగిన కాల్పులకు బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తగిన సమాధానం ఇచ్చింది. 

జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్థాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. గత ఏడాదిన్నర త‌రువాత మ‌రోసారి పాకిస్థాన్ కాల్పులకు తెగ‌బ‌డింది. కాలుల్ప విర‌మ‌ణ‌ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూలోని అర్నియా సెక్టార్‌లోని ఇండో-పాకిస్తాన్ సరిహద్దులో మంగ‌ళ‌వారం పాక్ రేంజర్లు కాల్పులు జ‌రిపారు. ఈ ఘ‌ట‌న‌కు ప్రతీకార చర్యగా భార‌త బలాగాలు(BSF) కాల్పులు జ‌రిపి గ‌ట్టి స‌మాధానమిచ్చింది. గతేడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ కాల్పులు జరగడం ఇదే తొలిసారి. 

బీఎస్ఎఫ్ విడుదల చేసిన ప్రకటన ప్ర‌కారం.. మంగ‌వారం ఉద‌యం బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్ పెట్రోలింగ్ చేస్తున్న‌ సమయంలో పాకిస్తాన్ వైపు నుండి కాల్పులు జ‌రిగాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన‌ బీఎస్ఎఫ్.. వెంటనే ఎదురుదాడికి దిగింది. ఈ సందర్భంగా దాదాపు 20 రౌండ్ల కాల్పులు జరిగినట్లు అధికారులు వెల్ల‌డించింది.  

కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘ‌న 

భార‌త్, పాకిస్తాన్ మ‌ధ్య 2021 ఫిబ్రవరి 25న కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని బీఎస్ఎఫ్ తెలిపింది. కానీ, పాక్ త‌రుచు ఈ ఒప్పందాన్ని విర‌మిస్తునే ఉంది. తాజాగా నేడు పాకిస్థాన్‌లోని అర్నియా సెక్టార్‌లో ఉల్లంఘ‌నకు పాల్ప‌డింది.  ఈ క్ర‌మంలో బీఎస్ ఎఫ్ తగిన సమాధానం ఇచ్చింది. ఇలాంటి దాడులతో ఉగ్రవాదుల్లోకి చొరబడేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తోందని BSF డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ SPS సంధు తెలిపారు.

గతంలోనూ పాకిస్థాన్ ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్పడింద‌ని తెలిపారు. తాజాగా జమ్మూ కాశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి సరిహద్దు భద్రతా దళం (బిఎస్‌ఎఫ్) సైనికులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ రేంజర్లు మంగళవారం ఉదయం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని తెలిపారు. అయితే, కాల్పుల్లో ఎలాంటి ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని సమాచారం.

click me!