ఫలించిన దౌత్యం.. పాక్ జైళ్ళలో మగ్గుతున్న 199 మంది భారతీయుల విడుదల !

Published : May 08, 2023, 01:45 PM IST
ఫలించిన దౌత్యం.. పాక్ జైళ్ళలో మగ్గుతున్న 199 మంది భారతీయుల విడుదల !

సారాంశం

తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టారన్న ఆరోపణలపై పాకిస్థాన్ నావికాదళం నిర్బంధించిన 199 మంది భారతీయ మత్స్యకారులను విడుదల చేయాలని పాకిస్థాన్ అధికారులు భావిస్తోంది.  

భారత దౌత్యం ఫలించింది. పాకిస్థాన్ జైళ్ళలో మగ్గుతున్న భారతీయ జాలర్లలను విడుదల చేయాలని పాకిస్తాన్ నిర్ణయించింది.  199 మంది భారతీయ మత్స్యకారులను శుక్రవారం విడుదల చేయాలని పాక్ అధికారులు భావిస్తున్నారు. పాక్ ప్రాదేశిక జలాల్లో అక్రమ చేపలు పట్టారనే ఆరోపణలపై అరెస్టు చేశారు. చర్చల అనంతరం సుహృద్భావంతో భారతీయ మత్స్యకారులను విడుదల చేస్తారని భావిస్తోంది. 199 మంది మత్స్యకారులతో పాటు స్వదేశానికి తరలించాల్సిన మరో భారతీయుడు ఈ సమయంలో మరణించినట్లు అధికారి తెలిపారు.

ఈ మేరకు సన్నాహాలు చేయాలని సంబంధిత ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు కోరినట్లు సింధ్‌లోని జైలు ఉన్నత పోలీసు అధికారి ఖాజీ నజీర్ తెలిపారు. ఈ మత్స్యకారులను లాహోర్‌కు పంపి వాఘా సరిహద్దులో భారత అధికారులకు అప్పగించనున్నారు. ఈ మత్స్యకారులు ప్రస్తుతం ఇక్కడి లాంధీ జైలులో ఉన్నారు.

ఇదే సమయంలో భారత జాతీయుడైన జుల్ఫికర్ అనారోగ్యంతో శనివారం కరాచీలోని ఆసుపత్రిలో మరణించాడని అధికారులు తెలిపారు. మత్స్యకారులతోపాటు జుల్ఫికర్‌ శవాన్ని కూడా పంపనున్నారు. లాంధీ జైలు అధికారుల ప్రకారం..భారతీయ ఖైదీ తీవ్ర జ్వరం, ఛాతీలో అసౌకర్యంతో ఫిర్యాదు చేసాడు. అతని పరిస్థితి గత వారం మరింత దిగజారింది. అతన్ని ఆసుపత్రికి పంపారు. అక్కడ అతను ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా మరణించాడని తెలిపారు.

జైళ్లలో ఉన్న వారికి ఇతర సహాయాన్ని అందించిన ఈధి వెల్ఫేర్ ట్రస్ట్ అధికారి జుల్ఫికర్ మరణాన్ని ప్రస్తావిస్తూ.. లాంధీ , మలిర్ జైళ్లలో తగిన ఆరోగ్య సౌకర్యాలు లేవని, అనారోగ్యంతో ఉన్న ఖైదీలు క్రమం తప్పకుండా సరైన చికిత్స అందించాలని, కానీ ప్రమాణాలను పాక్ అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు.  జైలులో తీవ్రమైన వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి  జైలు ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేవు. వారు రోగిని మరొక ఆసుపత్రికి మార్చమని సిఫార్సు చేస్తారు. కానీ చాలా సార్లు చాలా ఆలస్యం అవుతుందని అధికారి తెలిపారు. చాలా మంది ఖైదీలు కరాచీలోని లాంధీ , మలిర్ జైళ్లలో మగ్గుతున్నారు.

పాకిస్తాన్ ఇండియా పీపుల్స్ ఫోరమ్ ఫర్ పీస్ అండ్ డెమోక్రసీ ప్రకారం.. 631 మంది భారతీయ మత్స్యకారులు, మరో ఖైదీ ప్రస్తుతం కరాచీలోని లాంధీ,మలిర్ జైళ్లలో జైలు శిక్ష పూర్తి చేసినప్పటికీ ఉన్నారు. కరాచీలోని ఫోరమ్‌తో కలిసి పనిచేస్తున్న ఆదిల్ షేక్ మాట్లాడుతూ.. ఈ భారతీయ మత్స్యకారులందరూ పాకిస్తాన్ , భారతదేశం మధ్య సముద్రతీర సరిహద్దు ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆరోపిస్తూ అరెస్టు చేసిన తరువాత పాకిస్తాన్ జైళ్లలో ఉంచబడ్డారని చెప్పారు.

గతంలో కూడా అనేక మంది ఖైదీలు వ్యాధుల కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వారందరూ పేద,నిరక్షరాస్యులు అని తెలిపారు. జైలు అధికారుల ప్రకారం.. గతంలో కూడా కొంతమంది భారతీయ పౌర ఖైదీలు వ్యాధుల కారణంగా ఆసుపత్రులలో మరణించారు. మొత్తం 654 మంది భారతీయ మత్స్యకారులు కరాచీ జైళ్లలో ఉండగా, 83 మంది పాకిస్తానీ మత్స్యకారులు భారతీయ జైళ్లలో ఉన్నట్లు అంచనా. 654 మంది భారతీయ జాలర్లలో 631 మంది శిక్షను పూర్తి చేసి విడుదల కోసం ఎదురుచూస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్