భారత జవాన్ల దెబ్బకు తోక ముడిచిన ఉగ్రవాదులు: వీడియో వైరల్

Siva Kodati |  
Published : Sep 27, 2019, 05:17 PM ISTUpdated : Sep 27, 2019, 06:04 PM IST
భారత జవాన్ల దెబ్బకు తోక ముడిచిన ఉగ్రవాదులు: వీడియో వైరల్

సారాంశం

కుప్వారా సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించారు. వీరిని గుర్తించిన ఫార్వర్డ్ పోస్ట్ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. ఊహించని పరిణామానికి భయపడిన ముష్కరులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సైన్యం విడుదల చేసింది.   

భారత్‌లో విధ్వంసం సృష్టించాలని పాకిస్తాన్ కుట్రలు పన్నుతూనే ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో సరిహద్దులు దాటేందుకు వందల మంది ముష్కరులు సిద్ధంగా ఉన్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఈ క్రమంలో భారత సైన్యం కప్పుగప్పి మన భూభాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను జవాన్లు తరిమి కొట్టారు. అయితే ఇది ఇప్పటిది కాదు..

ఆర్టికల్ 370ని రద్దు చేయడానికి కొద్దిరోజుల ముందు జూలై 30వ తేదీన నలుగురు ఉగ్రవాదులు కుప్వారా సెక్టార్‌లో నియంత్రణ రేఖను దాటి దేశంలోకి చొరబడేందుకు యత్నించారు.

వీరిని గుర్తించిన ఫార్వర్డ్ పోస్ట్ జవాన్లు వెంటనే కాల్పులు జరిపారు. ఊహించని పరిణామానికి భయపడిన ముష్కరులు అక్కడి నుంచి పరుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సైన్యం విడుదల చేసింది.

 

 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !