రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం: 16 మంది దుర్మరణం

Siva Kodati |  
Published : Sep 27, 2019, 04:59 PM IST
రాజస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం: 16 మంది దుర్మరణం

సారాంశం

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోలెరా వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బోలెరా వాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. వివరాల్లోకి వెళితే.. డందానియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బలేసర్ మండలం జోధ్‌పూర్ వద్ద 125వ నెంబర్ జాతీయ రహదారిపై బోలెరో కారును బస్సు ఢీకొట్టింది.

ఈ ఘటనలో 16 మంది అక్కడికక్కడే మరణించారు.  మరణించిన వారిలో ఐదుగురు స్త్రీలతో పాటు ఒక చిన్నారి కూడా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బలెసర్, జోధ్‌పూర్ ఆసుపత్రులకు తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మరిన్ని వివరాలు అందాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !