నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు: కేరళలో ఎల్డీఎఫ్ విజయం

Siva Kodati |  
Published : Sep 27, 2019, 04:46 PM IST
నాలుగు రాష్ట్రాల్లో ఉపఎన్నికల ఫలితాలు: కేరళలో ఎల్డీఎఫ్ విజయం

సారాంశం

నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో భాగంగా కేరళలోని పాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామి కూటమి(ఎల్డీఎఫ్) అభ్యర్ధి విజయం సాధించాడు

నాలుగు రాష్ట్రాల ఉపఎన్నికల్లో భాగంగా కేరళలోని పాల అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాస్వామి కూటమి(ఎల్డీఎఫ్) అభ్యర్ధి విజయం సాధించాడు.

ఎల్డీఎఫ్ అభ్యర్ధిగా రంగంలోకి నిలిచిన సి. కప్పెన్.. కేరళ కాంగ్రెస్ (ఎం) అభ్యర్ధిపై 2,943 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ గెలుపుపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ హర్షం వ్యక్తం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తమకు అతిపెద్ద విజయమని, తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలతో స్నేహపూర్వకంగా మెలిగేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటుందని సీఎం స్పష్టం చేశారు.

మరోవైపు ఉత్తరప్రదేశ్‌లోని హమిర్‌పూర్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ, త్రిపురలోని బాధర్‌ఘాట్ అసెంబ్లీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !