India vs Pakistan: భారత సరిహద్దులో చొరబాటు.. పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న భారత జవాన్లు

Published : May 03, 2025, 11:48 PM ISTUpdated : May 03, 2025, 11:50 PM IST
India vs Pakistan: భారత సరిహద్దులో చొరబాటు.. పాక్‌ రేంజర్‌ను పట్టుకున్న భారత జవాన్లు

సారాంశం

Pakistan soldier arrested at rajasthan border: బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో చోరబడిన ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేసింది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. 

Pakistan soldier arrested at rajasthan border: భారత సరిహద్దులో చొరబాటుకు పాల్పడిన పాకిస్తాన్ రేంజర్ ను భారత సైన్యం అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ రేంజర్లు బీఎస్ఎఫ్ జవానును అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే ఇది జరిగింది. శనివారం బీఎస్ఎఫ్ రాజస్థాన్ సరిహద్దులో ఒక పాకిస్తాన్ రేంజర్ ని అరెస్ట్ చేయడం... భారత జవానును తిరిగి తెచ్చుకోవడంలో ఇది కీలకం కానుంది. జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గాం (Pahalgam Terror Attack) దాడిలో 26 మంది చనిపోయిన ఒక రోజు తర్వాత బీఎస్ఎఫ్ జవాను పాకిస్తాన్ ప్రాంతంలోకి వెళ్లడంతో వారికి చిక్కాడు.

పాక్ రెంజర్ ను ఎప్పుడు, ఎక్కడ, ఎలా అరెస్ట్ చేశారు?

బీఎస్ఎఫ్ వర్గాల సమాచారం ప్రకారం, రాజస్థాన్ సరిహద్దులో ఈ రేంజర్ ని అనుమానాస్పద కార్యకలాపాలకు పాల్పడుతుండగా పట్టుకున్నారు. ప్రాథమిక విచారణలో అతను సమాధానం చెప్పలేకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్ రాజస్థాన్ లోని భారత్-పాకిస్తాన్ సరిహద్దులో జరిగింది. దీంతో రాజస్థాన్ లోని సంబంధిత ప్రాంతాల్లో ఆందోళన మొదలైంది.

పాకిస్తాన్ లో బందీగా ఉన్న భారత జవాను, ఇంకా విడుదల కాలేదు

ఏప్రిల్ 23న బీఎస్ఎఫ్ జవాను పూర్ణం కుమార్ షా (Purnam Kumar Shaw) ని పాకిస్తాన్ రేంజర్లు పంజాబ్ సరిహద్దులో అరెస్ట్ చేశారు. భారత్ ఎన్నిసార్లు అడిగినా పాకిస్తాన్ ఇంకా ఆ జవానును విడుదల చేయలేదు.

భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు 

పహల్గాం దాడిలో 28 మంది అమాయకులు మరణించిన తర్వాత భారత్ పాకిస్తాన్‌పై పలు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. వాటిలో

  1. సింధు జల ఒప్పందాన్ని నిలిపివేయడం
  2. వాఘా-అటారీ సరిహద్దును మూసివేయడం
  3. పాకిస్తాన్ పౌరుల వీసాలను రద్దు చేయడం
  4. దౌత్య సంబంధాలను తగ్గించడం
  5. ఇరు దేశాల మధ్య దిగుమతి-నిగుమతులను నిలిపివేయడం
  6. పోస్టల్ సేవలను నిలిపివేయడం
  7. పాకిస్తాన్ యూట్యూబ్ ఛానెళ్లు, సోషల్ మీడియా ఖాతాలను నిషేధించడం

వంటి చర్యలను తీసుకుంది. సరిహద్దులో పాకిస్తాన్ వరుసగా కాల్పులకు తెగబడటంతో భారత్ గట్టి చర్యలు తీసుకుంటోంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !