ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ యువకుడు train tracksపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో రికార్డు చేసి social mediaలో షేర్ చేశాడు. యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లోని లలిత్ పూర్ లో ఒక యువకుడు రైలు కింద పడి suicide చేసుకున్నాడు. ఒక యువతి ఈ యువకుడిని ప్రేమ పేరుతో వంచించడమే కాకుండా లక్ష రూపాయలు తీసుకుని మోసం చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కలత చెందిన ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని తెలుస్తోంది.
అయితే ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ యువకుడు train tracksపై కూర్చుని తనకు ఆ యువతి చేసిన మోసాన్ని వివరిస్తూ ఒక వీడియో రికార్డు చేసి social mediaలో షేర్ చేశాడు. యువకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దానిని పోస్టుమార్టం కోసం తరలించారు. మృతుని కుటుంబ సభ్యులు ఆ యువతిపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
undefined
మీడియాకు అందిన సమాచారం ప్రకారం లలిత్‌పూర్- బీనా మార్గంలోని రైలు పట్టాలపై ఒక యువకుడి మృతదేహం కనిపించింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అదించారు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుడిని కక్రువా గ్రామానికి చెందిన దేవేంద్ర (30)గా గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.
ఈ సందర్భంగా మృతుని సోదరుడు ఇంద్ర పాల్ మాట్లాడుతూ తన సోదరుడు పనారీ గ్రామంలో ఉంటూ truck driver గా పని చేస్తున్నాడు అని చెప్పుకొచ్చాడు. కొంతకాలం క్రితం తన సోదరుడి వద్ద నుంచి లక్ష రూపాయల సొమ్మును ఓ యువతి తీసుకుని.. ఆ డబ్బును తిరిగి ఇవ్వకుండా తన సోదరుడిని ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు.
కాగా, దేవేంద్ర తాను ఆత్మహత్య చేసుకునే ముందు రికార్డు చేసిన వీడియోలో ‘జైన్ మందిరం సమీపంలో ఒక మహిళ పనిచేస్తున్నది. ఒక యువకుడు కూడా ఆమెతో పాటు ఉంటున్నాడని, తన దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఆ యువతి Cheating చేసిందని, దీనిని తట్టుకోలేక తాను రైలు పట్టాలపై కూర్చున్నానని, రైలు రాగానే ఆత్మహత్య చేసుకుంటానని, ఆమెను వదిలిపెట్టవద్దని’ పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఓ ఆకతాయి వేధింపులను తట్టుకోలేక యువతి బలవన్మరణానికి పాల్పడి ప్రాణాలు తీసుకున్న దారుణం యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో స్నేహితులను వెంటేసుకుని ఓ ఆకతాయి వెంటపడుతూ వేధిస్తుండటాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
పాఠశాలలను వణికిస్తున్న కరోనా కేసులు.. జైపూర్‌లో 11 మంది విద్యార్థులకు పాజిటివ్
వివరాల్లోకి వెళితే... yadadri bhuvanagiri district మోత్కూరు మండలం పనకబండ గ్రామానికి చెందిన దుర్గాభవాని(17) భువనగిరి పట్టణంలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే ఈ యువతి ఇంటిపక్కనే వుండే గురజాల ఏలేందర్ ప్రేమ పేరిట వెంటపడేవాడు. అతడి ప్రేమను అంగీకరించకపోవడంతో స్నేహితులతో కలిసి యువతి వెంటపడుతూ వేధించేవాడు. గతంలో ఈ వేధింపులను తట్టుకోలేక యువతి తన తండ్రి బట్టు రాజమల్లుకు విషయాన్ని తెలియజేసింది.
దీంతో అతడు గ్రామ పెద్దలకు తన కూతురిని పక్కింటి కుర్రాడు వేధిస్తున్న విషయాన్ని తెలియజేసి పంచాయితీ పెట్టాడు. గ్రామ పెద్దల ముందు ఇకపై యువతి వెంటపడనని ఒప్పుకున్న ఏలేశ్వర్ కొంతకాలం హైదరాబాద్ కు వెళ్లిపోయాడు. అక్కడే ఏడాదిపాటు పనిచేసుకుంటూ వున్నాడు.
అయితే ఇటీవల తిరిగి స్వగ్రామానికి వచ్చిన ఏలేశ్వర్ మళ్లీ దుర్గాభవానిని వేధించసాగాడు. ఆమె ఫోన్ నెంబర్ ను సంపాదించిన అతడు నిత్యం ఫోన్ చేస్తూ తనను ప్రేమించాలంటూ బెదిరించసాగాడు. ఇటీవల అతడి వేధింపులు మరీ ఎక్కువవడంతో యువతి తట్టుకోలేకపోయింది. దీంతో దారుణ నిర్ణయం తీసుకుంది.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుర్గాభవాని గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె తీవ్ర అస్వస్థతకు గురవడంతో కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందిన యువతి కోలుకున్నట్లే కోలుకుని మళ్లీ తీవ్ర అస్వస్థతకు గురయ్యింది. దీంతో మరింత మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్ కు తరలించారు. గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ దుర్గాభవాని మృతిచెందింది.