
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ టీమిండియాపై కౌంటర్లు విసిరాడు. సెమీ ఫైనల్‌లో భారత జట్టు ఓడిపోవడాన్ని షరీఫ్ పాత మ్యాచ్ ఒకదానితో కంపేర్ చేశాడు. సెమీస్‌లో ఇంగ్లాండ్ మ్యాచ్‌తో భారత ఓటమిని, గత టీ 20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 దశలో పాకిస్తాన్‌తో భారత ఓటమితో పోల్చాడు.
టీ20 వరల్డ్ కప్‌లో పది వికెట్లతో విజయం సాధించడం గొప్ప విషయమే. సెమీస్‌లో తాజాగా, భారత్ జట్టు పై ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పది వికెట్లతో విజయం సాధించింది. 168 పరుగులు సాధించిన భారత్ పై ఇంగ్లాండ్ విజయం సాధించింది. 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ ఓపెనర్లే సాధించి పెట్టారు. ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించారు.
Also Read: భారత్ ఓడిపోతుందనే విషయాన్ని పట్టించుకోవట్లే.. కానీ: టీమిండియా పరాజయంపై శశిథరూరర్ కామెంట్
ఈ విజయాన్ని పాకిస్తాన్ పీఎం.. గతంలో టీమిండియాపై భారత్‌పై పాకిస్తాన్ విజయంతో పోల్చాడు. గతేడాది టీ20 వరల్డ్ కప్‌లో సూపర్ 12 స్టేజ్‌లో టీమిండియా పై పాకిస్తాన్ విజయం సాధించింది. అప్పుడు కూడా భారత్ పై పాకిస్తాన్ ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా గెలిచింది. ఈ విషయాన్ని క్లుప్తంగా పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేశాడు.
అంటే. ఈ ఆదివారం ఇలా 152/0 వర్సెస్ 170/0 అన్నమాట అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశారు. టీ20 వరల్డ్ కప్ అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చాడు. దానికి ముందు పాకిస్తాన్, ఇంగ్లాండ్ దేశాల జాతీయ పతాకాలను పేర్కొన్నాడు. తద్వారా గతంలో పాకిస్తాన్, ఇప్పుడు ఇంగ్లాండ్ జట్లు భారత క్రికెట్ టీమ్‌ను ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా విజయం సాధించుకున్నాయని పరోక్షంగా వెల్లడించాడు.
టీ20 వరల్డ్ కప్‌లో రెండుసార్లు ఒక్క వికెట్ కూడా నష్టపరచకుండా ఒక జట్టు పై ఓడిపోయిన జట్టుగా భారత జట్టే ఉన్నది.