Seema Haider: పాకిస్తాన్ నుంచి వచ్చిన సీమా హైదర్‌కు గర్భం.. గుడ్ న్యూస్ చెప్పిన సచిన్ దంపతులు

By Mahesh K  |  First Published Jan 2, 2024, 10:46 PM IST

పాకిస్తాన్ జాతీయురాలు సీమా హైదర్, యూపీకి చెందిన సచిన్ మీనాలు పెళ్లి చేసుకున్నారు. తాజాగా, సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్నట్టు సీమా హైదరీ ఓ ప్రైవేట్ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. పబ్జి ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత సీమా నలుగురు పిల్లలతో సహా పాకిస్తాన్ సరిహద్దు దాటుకుని ఇండియాకు వచ్చింది.
 


Pakistan: సీమా హైదర్‌, సచిన్ మీనా దంపతుల న్యూ  ఇయర్ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. సీమా హైదర్‌ గర్భం దాల్చినట్టు వెల్లడించారు. సచిన్ బిడ్డకు తల్లి కాబోతున్నట్టు సీమా హైదర్‌ తెలిపారు. ఓ ప్రైవేటు చానెల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ వారు ఈ విషయాన్ని వెల్లడించారు.

సీమా హైదర్‌, సచిన్ మీనాల క్రాస్ బార్డర్ లవ్ స్టోరీ దేశవ్యాప్తంగా ఫేమస్. వారి గురించి అనేక షార్ట్‌లు, వీడియోలు, కామెంట్లు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వచ్చిన సంగతి తెలిసిందే. వీరికి పబ్జీ గేమ్‌లో పరిచయం అయింది. పబ్జీ గేమ్ ఆడుతూ వీరిద్దరూ పరిచయం పెంచుకున్నారు. ఆ తర్వాత వీరి మధ్య ప్రేమ చిగురించింది. 

Latest Videos

Also Read: Lok Sabha Elections: పార్లమెంటు ఎన్నికల్లో హంగ్.. మాయావతి వ్యూహం ఏమిటో తెలుసా?

కానీ, సీమా హైదర్‌కు అప్పటికే పెళ్లైంది. అంతేనా, నలుగురు పిల్లలు కూడా. కానీ, ప్రియుడి వద్దకు ఎలాగైనా రావాలని అనుకుంది. ఆమె తన నలుగురు పిల్లలతోపాటుగా పాకిస్తాన్ సరిహద్దు దాటి యూపీకి చేరుకుంది. ఆమెను సచిన్ మీనా ఆహ్వానించాడు. వీరి లవ్ స్టోరీ సెన్సేషన్ క్రియేట్ చేసింది. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ జంట దాంపత్యం సాఫీగానే సాగిపోతున్నది. తాజాగా, వారు గుడ్ న్యూస్ కూడా వెల్లడించారు. పాకిస్తాన్ జాతీయురాలైన సీమా హైదర్‌‌కు 30 ఏళ్లు. యూపీకి చెందిన సచిన్ మీనాకు 22 ఏళ్లు. వీరిద్దరూ ఇప్పుడు గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నారు.

click me!