'PUBG' పరిచయం .. నలుగురి పిల్లలతో సరిహద్దు దాటిన పాక్ మహిళ.. 

Published : Jul 04, 2023, 01:19 AM IST
'PUBG' పరిచయం .. నలుగురి పిల్లలతో సరిహద్దు దాటిన పాక్ మహిళ.. 

సారాంశం

గ్రేటర్ నోయిడాలో అక్రమంగా నివసిస్తున్న పాకిస్థాన్ మహిళ, ఆమె నలుగురు పిల్లలను అదుపులోకి తీసుకున్నారు. ఆమె  గ్రేటర్ నోయిడాకు చెందిన వ్యక్తిని PUBG గేమ్ ద్వారా కలిసింది.  మహిళకు ఆశ్రయం కల్పించిన వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. 

ప్రేమ ఎప్పుడు, ఎలా పుడుతుంది అనేది ఎవరికీ తెలియదు. సరిగా చెప్పడం కూడా సాధ్యం కాదు. అలాగే.. ప్రేమకు కులం, మతం, ప్రాంతం అనే బేదం ఉండదు. ప్రేమించిన వ్యక్తి ఎక్కడ ఉన్నవారి కోసం సప్తసముద్రాలు దాటి.. ఒక్కటి కావాలనే చూస్తారు. అలా గ్రేటర్ నోయిడాలో ఇలాంటి ఉదంతం తెరపైకి వచ్చింది. PUBG గేమ్ ఆడుతున్న యువకుడు నలుగురు పిల్లల తల్లితో ప్రేమలో పడ్డాడు.

దీంతో ఆ మహిళ మూడు దేశాల సరిహద్దులు దాటి గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. వారిద్దరూ రబూపురలో అద్దె ఇల్లు తీసుకుని సహజీవనం ప్రారంభించారు. ఈ క్రమంలో  ఆ మహిళ తన పేరు సీమ అని మార్చుకుంది. కానీ బండారం బయటపడింది. దీంతో ఆ ప్రేమికులు అక్కడి నుంచి తమ పిల్లలతోసహా పారిపోయారు. సమాచారం ప్రకారం.. మే 13 న పాకిస్తాన్ మహిళ నలుగురు పిల్లలతో బస్సులో గ్రేటర్ నోయిడాకు చేరుకుంది.
 
రబుపురా నివాసి అయిన సచిన్‌కు పబ్‌జి ఆడడం అలవాటు.  గేమ్ ఆడుతున్న సమయంలో సచిన్‌కు ఓ పాకిస్థానీ మహిళతో పరిచయం ఏర్పడింది. తరుచు మాట్లాడుకోవడంతో వీరిద్దరి మధ్య స్నేహం మొదలైంది. క్రమంగా ఇరువురి అభిప్రాయాలు ఏకం కావడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. ఇద్దరూ ఒకరితో ఒకరు జీవించాలని కలలు కన్నారు.

ఈ క్రమంలో మే 13న ఆ మహిళ పాకిస్థాన్ వదిలి వెళ్లాలని నిర్ణయించుకుంది. నలుగురు పిల్లలతో మూడు దేశాల సరిహద్దులు దాటుతుండగా ఆ మహిళ గ్రేటర్ నోయిడాకు చేరుకుంది. అద్దెకు ఇల్లు తీసుకుని ప్రేమికుడు సచిన్‌తో కలిసి జీవించడం ప్రారంభించింది. ఈ క్రమంలో  ఆ మహిళ తన పేరు సీమ అని మార్చుకుంది. కానీ బండారం బయటపడింది. దీంతో ఆ ప్రేమికులు అక్కడి నుంచి తమ పిల్లలతోసహా పారిపోయారు.  మహిళ పాకిస్థానీ అని క్లూ లభించడంతో పోలీసులు మూడు బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ, ఎలక్ట్రానిక్ నిఘా సహాయం తీసుకున్నారు.
 
నిరంతర దాడులు, సోదాల అనంతరం  ఆ మహిళా పోలీసులు పట్టుబడ్డారు. మహిళను విచారిస్తున్నట్లు ఏడీసీపీ అశోక్ కుమార్ తెలిపారు. దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించారు. దర్యాప్తు సంస్థలు అప్రమత్తమయ్యాయి. పాకిస్థాన్ మహిళ పేరు సీమా గులాం హైదర్ అని చెబుతున్నారు. PUBG ఆడుతున్నప్పుడు ఆ మహిళ సచిన్‌తో పరిచయం ఏర్పడిందని చెప్పాడు. పాకిస్థానీ మహిళ నలుగురు పిల్లలకు తల్లి. విచారణ అనంతరం దర్యాప్తు సంస్థలు వివరాలు పంచుకుంటాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

TVK Party Vijay: టివికె పార్టీ గుర్తు ఆవిష్కరణలో దళపతి విజయ్ పవర్ ఫుల్ స్పీచ్ | Asianet News Telugu
Vijay Launches TVK Party Symbol Whistle: టివికె పార్టీ గుర్తుగా ‘విజిల్’ | Asianet News Telugu