పహల్గాం మృతులకు అమరుల హోదా : కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

Published : Apr 30, 2025, 09:14 PM IST
పహల్గాం మృతులకు అమరుల హోదా : కేంద్రానికి రాహుల్ గాంధీ డిమాండ్

సారాంశం

పహల్గాం దాడిలో చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దోషులకు కఠిన శిక్ష పడాలని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నాయని ఆయన అన్నారు.

Pahalgam Attack: ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారికి అమరుల హోదా ఇవ్వాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ దాడికి పాల్పడిన వారికి తగిన శిక్ష పడుతుందని, ప్రతిపక్షాలు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నాయని ఆయన అన్నారు.

రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..."నేను ఈరోజు కాన్పూర్ వెళ్లాను. ఉగ్రవాద బాధిత కుటుంబంతో మాట్లాడాను. వారి కొడుకును దారుణంగా చంపేశారు. 28 మందిని అలాగే చంపారు. చాలా మంది గాయపడ్డారు. ఇది ఎలా జరిగిందో నేను వ్యాఖ్యానించదల్చుకోలేదు. నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే ఎవరు చేసినా, ఎక్కడున్నా వాళ్ళు దీనికి తగిన శిక్ష అనుభవించాల్సిందే. ఇలాంటివి ఇండియాతో చేయకూడదని గుర్తుండాలి" అని అన్నారు.

 

"అఖిలపక్ష సమావేశంలో మేము స్పష్టంగా చెప్పాం, జరిగింది ఆమోదయోగ్యం కాదు. ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి 100% మద్దతు ఇస్తాయి, ఇస్తున్నాయి. మోదీ యాక్షన్ తీసుకోవాలి. పూర్తిగా యాక్షన్ తీసుకోవాలి. ప్రతిపక్షాలన్నీ ఆయన వెంటే ఉన్నాయి. దీన్ని చేసిన వాళ్ళు తగిన శిక్ష అనుభవించాల్సిందే. చనిపోయిన 28 మంది కుటుంబాల సందేశాన్ని మీడియా ద్వారా ప్రధానికి చేరవేస్తున్నా. ప్రధానిగారు, మా పిల్లలు అమరులయ్యారని వాళ్ళు అంటున్నారు. వాళ్ళకి అమరుల హోదా ఇవ్వాలని కోరుతున్నారు." అని రాహుల్ తెలిపారు. 

శుభమ్ ద్వివేది కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్  

పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన శుభమ్ ద్వివేది కుటుంబాన్ని బుధవారం రాహుల్ గాంధీ కలిశారు. ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేస్తూ, "దేశం దుఃఖంలో ఉన్న కుటుంబాలతో ఉంది. ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి. బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. ప్రతిపక్షాలు ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చాయి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశం కోసం డిమాండ్ చేశాయి." అన్నారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajinikanth Pressmeet: సీఎం విజయ్ పై రజినీకాంత్ సంచలన కామెంట్స్ | Asianet News Telugu
Best Roads In The World: అమెరికాా కాదు.. చైనా కాదు.. ప్రపంచంలో బెస్ట్ రోడ్లు ఉన్న టాప్ 10 దేశాలు ఇవే !