పార్టీ పెద్దలకు స్వీట్లు పంచేందుకు ఢిల్లీ వెళ్లిన ఫడ్న‌వీస్ - మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్

Published : Jun 21, 2022, 03:14 PM ISTUpdated : Jun 21, 2022, 03:15 PM IST
పార్టీ పెద్దలకు స్వీట్లు పంచేందుకు ఢిల్లీ వెళ్లిన ఫడ్న‌వీస్ - మ‌హారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్ర‌కాంత్ పాటిల్

సారాంశం

మహారాష్ట్రలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. సంకీర్ణ మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పుకూలిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివసేనకు చెందిన 11 మంది ఎమ్మెల్యేలు, ఒక మంత్రి పార్టీ హైకమాండ్ తో టచ్ లో లేరు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ పెద్దలకు స్వీట్లు పంచేందుకు ఆయన హస్తిన కు చేరుకున్నారని ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ చంద్రకాంత్ పాటిల్ అన్నారు. 

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం నెలకొన్న నేపథ్యంలో ఆ రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు చంద్ర‌కాంత్ పాటిల్ మంగ‌ళ‌వారం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మాజీ సీఎం దేవేందర్ ఫడ్నవీస్ తమ పార్టీ నాయకులకు మిఠాయిలు పంచడానికి ఢిల్లీ వెళ్లార‌ని అన్నారు. ‘‘ఎన్నికల్లో గెలిచిన తర్వాత మా జాతీయ నేతల వద్దకు స్వీట్లు పంచడం మా సంప్రదాయం. అలాగే ఇప్పుడు కూడా దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీలోని మా పార్టీ నేతలకు స్వీట్లు పంచేందుకు వెళ్లారు ’’ అని ఆయ‌న వార్తా సంస్థ ఏఎన్ఐతో తెలిపారు. 

మ‌హారాష్ట్రలోని అధికార మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నందున చంద్ర‌కాంత్ పాటిల్ చేసిన వ్యాఖ్య‌లు భారీ ప్రాముఖ్య‌త‌ను సంత‌రించుకున్నాయి. ప్రముఖ శివసేన నాయకుడు, రాష్ట్ర క్యాబినెట్ మంత్రి ఏక్‌నాథ్ షిండే 10 మంది పార్టీ ఎమ్మెల్యేలతో క‌నిపించ‌కుండా పోయారు. దాదాపు నిన్నటి నుంచి ఆయ‌న అందుబాటులోకి రాలేదు.  ఎమ్మెల్యేలను తీసుకొని షిండే గుజరాత్ రాష్ట్రం సూరత్‌లోని ఓ హోటల్‌కు వెళ్లినట్లు సమాచారం.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భద్రత పెంపు..

ఈ ప‌రిణామాల‌ను శివసేన సీనియ‌ర్ నాయ‌కుడు, ఎంపీ సంజయ్ రౌత్ కూడా ధృవీకరించారు. ‘‘ శివసేన నాయ‌కుడు, మంత్రి ఏక్ నాథ్ షిండే కొంత మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం అందుబాటులో లేరు. MVA ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాజస్థాన్, మధ్యప్రదేశ్ కంటే మ‌హారాష్ట్ర చాలా భిన్న‌మైన రాష్ట్రం అని బీజేపీ గుర్తుంచుకోవాలి ’’ అని ఆయ‌న అన్నారు. 

Agnipath: అగ్నిపథ్‌ను వెనక్కి తీసుకునే ప్రశ్నే లేదు: ఎన్ఎస్ఏ అజిత్ దోవల్

మహారాష్ట్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరిగిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంవీఏ అభ్యర్థి చంద్రకాంత్ హందోరే ఓడిపోయారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ (MLC)లోని మొత్తం 10 సీట్లలో భారతీయ జనతా పార్టీ (BJP) ఐదు సీట్లు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP), శివసేన (Shivasena) చెరో రెండు సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ (Congress) ఒక సీటును కైవసం చేసుకోగలిగింది. ఈ పరిణామంపై బీజేపీ నేత సీనియర్ నేత వ్యంగ్యంగా స్పందించారు. ‘‘మహారాష్ట్ర విధాన పరిషత్ ఎన్నికల ఫలితాలు- శివసేన (మాఫియా సేన)కు 52 ఓట్లు వచ్చాయి. తిరుగుబాటు చేసిన 12 మంది ఎమ్మెల్యేలు (55 శివసేన + 9 మంది మద్దతుదారులు = 64) ఉద్ధవ్ థాకరే మాఫియా సర్కార్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది ’’ అని బీజేపీ ఆయ‌న ట్వీట్ చేశారు. 

తృణముల్ కాంగ్రెస్ పార్టీకి యశ్వంత్ సిన్హా రాజీనామా.. రాష్ట్రపతి ఎన్నిక‌ల్లో పోటీ చేసే ఛాన్స్ ?

అయితే తాజాగా మ‌హారాష్ట్రలో వేగంగా మారుతున్న రాజకీయ స‌మీక‌ర‌ణ‌ల‌పై ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వ‌ర్ స్పందించారు. ప్రభుత్వంలో మార్పు అవసరం లేదని తాము భావిస్తున్నామని చెప్పారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పు లేదని శరద్ పవార్ తేల్చి చెప్పారు. సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేపై త‌ను పూర్తి విశ్వాసం ఉంద‌ని చెప్పారు. ఏక్ నాథ్ షిండే సీఎం కావాల‌ని అనుకున్నార‌ని ఎప్పుడూ త‌మ‌తో ప్ర‌స్తావించ‌లేద‌ని ఆయ‌న తెలిపారు. ఆయ‌న వ్య‌వ‌హారం శివ‌సేన అంత‌ర్గ‌త స‌మ‌స్య‌గా ప‌వార్ అభివ‌ర్ణించారు. శివసేన ఎలాంటి నిర్ణ‌యం తీసుకున్నా.. తాము వెంటే ఉంటామ‌ని స్ప‌ష్టం చేశారు. 

PREV
click me!

Recommended Stories

కేవలం పదో తరగతి చదివుంటే చాలు.. రూ.57,000 జీతంతో కేంద్ర హోంశాఖలో ఉద్యోగాలు
Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?