తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భద్రత పెంపు..

Published : Jun 21, 2022, 03:01 PM ISTUpdated : Jun 21, 2022, 03:14 PM IST
తెలంగాణ  బీజేపీ చీఫ్ బండి సంజయ్‌కు భద్రత పెంపు..

సారాంశం

తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో బండి సంజయ్‌కు 1+5 (కానిస్టేబుళ్లు)తో రోప్‌ పార్టీ ఏర్పాటు చేశారు. 

తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు పోలీసులు భద్రతను పెంచారు. ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో బండి సంజయ్‌కు 1+5 (కానిస్టేబుళ్లు)తో రోప్‌ పార్టీ ఏర్పాటు చేశారు. అదనంగా ఎస్కార్ట్‌ వాహనాన్ని పోలీసులు కేటాయించారు. హైదరాబాద్‌ పరిధిలో బండి సంజయ్‌కు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్‌కు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్‌ నివేదిక ప్రకారం పోలీసులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం అగ్నిపథ్‌ స్కీమ్‌పై ఆందోళనలు కొనసాగుతున్న తాజా పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్‌కు అదనపు భద్రతను ఏర్పాటు చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

Nitin Nabin Net Worth : బిజెపి నూతన జాతీయాధ్యక్షుడి ఆస్తిపాస్తులు ఎన్నో తెలుసా..?
VB-G RAM G : కూలీలకు నిరుద్యోగ భృతి.. అందకుంటే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేయండి