Sindhutai sapkal: "అనాథ పిల్ల‌ల అమ్మ" సింధుతాయ్‌ సప్కాల్ ఇక‌లేరు..

By Rajesh KFirst Published Jan 5, 2022, 5:14 AM IST
Highlights

Sindhutai sapkal: అనాథ పిల్లలు అమ్మ , పద్మశ్రీ అవార్డు గ్రహీత, సింధుతాయ్‌ సప్కాల్‌ (74) క‌న్నుమూశారు. గ‌త కొన్నిరోజులుగా  అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆమె పుణెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప‌రిస్థితి విషమించి.. సింధుతాయ్‌ మృతిచెందారు.
 

Sindhutai sapkal: సంఘ సేవకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, అనాథ పిల్లలు అమ్మ సింధుతాయ్‌ సప్కాల్‌ (74) క‌న్నుమూశారు. గ‌త కొన్నిరోజులుగా  అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆమె పుణెలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్ర‌మంలో ఆమెకు మంగళవారం రాత్రి  గుండెపోటు రావ‌డంతో ప‌రిస్థితి విషమించి.. సింధుతాయ్‌ మృతిచెందారు.  సింధుతాయ్‌ సప్కాల్ మహారాష్ట్రలోని వార్ధాలో ఓ పేద కుటుంబంలో పుట్టారు. చాలా మంది పిల్లల లాగే ఆమె కూడా వివక్షను ఎదుర్కొన్నారు.  ఆమెను చాలా మంది మాయి అని పిలుస్తారు. అంటే అమ్మ అని అర్థం. ఆమెను వెయ్యి మంది అనాథల తల్లిగా అభివర్ణిస్తారు.

నిజానికి ఆమె 2000 మంది అనాథలను దత్తత తీసుకున్నారు. ఆమె హడప్సర్ సమీపంలో పూణేలో సన్మతి బాల్ నికేతన్ సంస్థ - అనాథ శరణాలయాన్ని నడుపుతున్నారు. ఆమె త‌న జీవితంలో  ఎంతో మంది అనాథ పిల్ల‌ల‌ను ఓ అమ్మ‌గా ఆధారించింది. ఈ క్ర‌మంలో ఆమె ఎన్నో సామాజిక సేవకు అనేక అవార్డులను అందుకుంది. ఆమె జీవిత క‌థ ఆధారంగా 2010లో మరాఠీ లో'మి సింధుతాయ్ సప్కల్ బోల్తే' పేరుతో బయోపిక్ వ‌చ్చంది.  ఆమె సేవాల‌కు కేంద్ర ప్ర‌భుత్వం  పద్మ అవార్డు ఇచ్చి స‌త్కారించింది. 

 పద్మశ్రీ అవార్డు గ్రహీత సింధుతాయ్‌ మృతికి ప్రధాని న‌రేంద్ర‌మోడీ సంతాపం వ్యక్తం చేశారు.  ఆమె సమాజానికి చేసిన సేవలతో ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఆమె కృషి వ‌ల్ల ఈ రోజు ఎంతో మంది  ఆనాథ‌ పిల్లలు.. ఉత్తమ జీవితాన్ని గడుపుతున్నారు. అట్టడుగు వర్గాల కోసం సైతం ఆమె కృషిచేశారు. సింధుతాయ్‌ మృతి తీరని లోటు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి" అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

click me!