సల్మాన్ రష్దీపై దాడి.. రెండు రోజుల తరువాత స్పందించిన మాజీ భార్య పద్మాలక్ష్మి.. ఏమంటుందంటే...

Published : Aug 16, 2022, 11:44 AM IST
సల్మాన్ రష్దీపై దాడి.. రెండు రోజుల తరువాత స్పందించిన మాజీ భార్య పద్మాలక్ష్మి.. ఏమంటుందంటే...

సారాంశం

సల్మాన్ రష్డీ పీడకలలాంటి శుక్రవారం రాత్రి దాడినుంచి కోలుకుంటున్నారు అంటూ ఆయన మాజీ భార్య పద్మాలక్ష్మి ట్వీట్ చేశారు. 

లాస్ ఏంజిల్స్ : భారత సంతతికి చెందిన వివాదాస్పద రచయిత సల్మాన్ రష్దీ కత్తిపోట్లకు గురైన నేపథ్యంలో ఆయన మాజీ భార్య  భారతీయ అమెరికన్ మోడల్, టీవీ హోస్ట్, రచయిత్రి పద్మాలక్ష్మి  ఆలస్యంగా ట్వీట్ చేశారు. అమెరికా దేశంలోని న్యూయార్క్ నగరంలో కత్తిపోటు ఘటన తర్వాత salman rushdie త్వరగా కోలుకోవాలని padma lakshmi ఆకాంక్షించారు. పద్మాలక్ష్మీ 2004వసంవత్సరంలో సల్మాన్ రష్దీని వివాహం చేసుకున్నారు.

నాలుగేళ్ల పాటు కాపురం…
పెళ్లి తర్వాత సల్మాన్ రష్దీతో నాలుగేళ్ల పాటు కాపురం చేశారు పద్మాలక్ష్మి. నాలుగేళ్ల తర్వాత పద్మాలక్ష్మి, రష్డీలు విడిపోయారు.  రష్దీ మీద కత్తిపోటు సంఘటన జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె ట్వీట్ చేశారు. శుక్రవారం కత్తిపోటు ఘటన తర్వాత సల్మాన్ రష్డీ కోలుకుంటున్నారు. ఇప్పుడు ఆయన త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాను’ అని పద్మాలక్ష్మి ట్విట్టర్లో పేర్కొన్నారు.

Salman Rushdie : సల్మాన్ రష్దీ ప‌రిస్థితి విష‌మం.. వెంటిలేట‌ర్ పై చికిత్స‌.. కంటి చూపు కోల్పోయే ప్రమాదం

సల్మాన్ రష్డీకి  పద్మాలక్ష్మి నాల్గవ భార్య..
పద్మాలక్ష్మి సల్మాన్ రష్డీకి నాల్గవ భార్య.. రష్డీ గతంలో జాఫర్ తల్లి క్లారిస్సా లువార్డ్, ఎలిజబెత్ వెస్ట్ లను వివాహం చేసుకున్నాడు. రష్డీతో అతని 23 యేళ్ల కుమారుడు మిలన్ రష్డీ ఉన్నాడు. తన తండ్రి గురించి కుటుంబం తరఫున అతని పెద్ద కుమారుడు జాఫర్ రష్డీ ఒక ప్రకటన చేశాడు. ‘నా తండ్రి ఆస్పత్రిలో విస్థృతమైన వైద్య చికిత్స పొందుతున్నప్పుడు మొదట్లో పరిస్థితి విషమంగా ఉంది’ అని జాఫర్ చెప్పాడు. ‘నా తండ్రికి వెంటిలేటర్ తొలగించినప్పుడు మేం చాలా ఉపశమనం చెందాం. నా తండ్రి మాట్లాడుతున్నాడు’ అని సల్మాన్ రష్డీ పెద్ద కుమారుడు జాఫర్ రష్దీ చెప్పారు. 

 

PREV
click me!

Recommended Stories

8th Pay Commission : మినిమం శాలరీనే రూ.18,000 నుండి రూ.51,000 పెంపు.. ఈ స్థాయిలో జీతాలు పెరుగుతాయా..?
Devta Chhatrakhand Panchveer: హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో న్యూ ఇయర్ వేడుకలు| Asianet News Telugu