చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆరెస్సెస్.. : కాంగ్రెస్ నాయ‌కుడు సిద్ధరామయ్య

By Mahesh RajamoniFirst Published Aug 16, 2022, 10:50 AM IST
Highlights

Karnataka: ప్రముఖ వార్తాపత్రికలలో కర్ణాటక ప్రభుత్వ స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రకటన నుండి భారతదేశ మొదటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూను తప్పించడంపై కాంగ్రెస్ నాయ‌కుడు సిద్ధరామయ్య.. భార‌తీయ జ‌న‌తా పార్టీ(బీజేపీ), అరెస్సెస్ లపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. 
 

Congress leader Siddaramaiah: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ప్ర‌చురించిన ఓ ప్ర‌క‌ట‌న ఇప్పుడు రాష్ట్రంలో రాజ‌కీయ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీ, స‌హా ప‌లు పార్టీల నాయ‌కులు ప్ర‌భుత్వ తీరును ఖండిస్తున్నారు. వివ‌రాల్లోకెళ్తే.. స్వాతంత్య్ర దినోత్స‌వం నేప‌థ్యంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రకటనలో ప్రచురించిన స్వాతంత్య్ర‌ సమరయోధుల జాబితా నుండి భార‌త దేశ మొద‌టి ప్ర‌ధాని, స్వాత‌త్య్ర స‌మ‌ర‌యోధులు జవహర్‌లాల్ నెహ్రూ పేరును తొలగించినందుకు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు సిద్ధరామయ్య డిమాండ్ చేశారు. " నేటి ప్రభుత్వ ప్రకటనలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూను స్వాతంత్య్ర‌ సమరయోధుల జాబితాలో చేర్చకపోవడం, తన కుర్చీని కాపాడుకోవడానికి ఒక ముఖ్యమంత్రి ఎంత దిగజారిపోతాడో చూపిస్తుంది" అని మాజీ ముఖ్యమంత్రి  సిద్ద‌రామ‌య్య  అన్నారు. 

సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న.. ‘‘పండిట్ నెహ్రూను అవమానించినందుకు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై యావత్ దేశానికి క్షమాపణలు చెప్పాలి. తమ దేశ తొలి ప్రధానిని కించపరిచే వారిని భారతదేశం, కర్ణాటక ప్రజలు ఎన్నటికీ అంగీకరించరు” అని సిద్ధరామయ్య అన్నారు. "తనను జైలు నుండి విడుదల చేయమని బ్రిటిష్ అధికారులను వేడుకున్న సావర్కర్ ముందు వరుసలో స్థానం పొందాడు. కానీ, అణగారిన వర్గాల గొంతుకగా నిలిచి స్వాతంత్య్రం కోసం పోరాడిన బాబా సాహెబ్‌ను చివరి వరుసలో ఉంచారు’’ అని ప్రభుత్వ ప్రకటన నేప‌థ్యంలో విమ‌ర్శ‌లు గుప్పించారు. బ్రిటీష్ అధికారులను వేడుకున్న సావర్కర్‌ను తప్పించి, తన మనుగడ కోసం వారికి తొత్తులుగా వ్యవహరించిన సావర్కర్‌ను మినహాయించి ఆర్‌ఎస్‌ఎస్‌లో స్వాతంత్య్ర సమరయోధునిగా చూపించడానికి ఎవరూ లేరని బొమ్మై ప్రభుత్వ ప్రకటన స్పష్టంగా చూపిస్తుంది” అని సిద్ధరామయ్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

“ఆరెస్సెస్ మతతత్వాన్ని-మహాత్మా గాంధీని హత్య చేయడానికి దాని మద్దతును తీవ్రంగా వ్యతిరేకించినందున నెహ్రూ పట్ల ఆరెస్సెస్ ద్వేషాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే, నెహ్రూ ఆరెస్సెస్ ను నిషేధించారు.. లౌకికవాదాన్ని సమర్థించారు. కానీ, మిస్టర్ బొమ్మాయ్ మీ తప్పు ఏమిటి? అంటూ ప్ర‌శ్నించారు. బ్రిటీష్ వారు 9 ఏళ్లపాటు జైలులో ఉన్న సమయంలోనే స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనేలా ప్రజలను ప్రేరేపించేందుకు పండిట్ నెహ్రూ లేఖలు, పుస్తకాలు రాశారని బొమ్మై గుర్తుంచుకోవాలి. సావర్కర్‌లా నెహ్రూ బ్రిటిష్ వారికి క్షమాపణలు, క్షమాపణలు రాయకపోవడం బాధాకరమని ఆర్‌ఎస్‌ఎస్‌ భావిస్తున్నట్లుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  రాష్ట్ర ప్ర‌భుత్వ ప్రకటనలో మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, వీర్ సావర్కర్ స‌హా 10 మంది జాతీయ స్వాతంత్య్ర‌ సమరయోధులు ఉన్నారు. 

When we thought slavery ended with the British gone, proved everyone wrong by showing that he is still a slave to

Not including in the list of freedom fighters in today's govt ad shows how low a CM can go to save his chair. pic.twitter.com/QHULS19ycG

— Siddaramaiah (@siddaramaiah)

 

click me!