యూపీలో ఘోర ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి

Published : Aug 16, 2022, 11:11 AM IST
యూపీలో ఘోర ప్రమాదం.. ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు మృతి

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంతో దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.  కురవాలి పోలీస్ స్టేషన్ సమీపంలోని జీటీ రోడ్‌లోని ఖిరియా పీపాల్ గ్రామ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వేగంతో దూసుకొచ్చిన ట్రక్కు రోడ్డు పక్కన ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది.  కురవాలి పోలీస్ స్టేషన్ సమీపంలోని జీటీ రోడ్‌లోని ఖిరియా పీపాల్ గ్రామ సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో.. ప్రమాదం  జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. మృతుల్లో రిటైర్డ్ సబ్ ఇన్‌స్పెక్టర్ కూడా ఉన్నారు. అయితే ఇంకా శిథిలాల్లో ఒకరు చిక్కుకున్నట్టుగా పోలీసులు తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్పారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే భారీగా పోలీసులు, రెస్క్యూ సిబ్బందికి అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలంలో శిథిలాల తొలగింప ప్రక్రియ చేపట్టారు. 

మెయిన్‌పురి ఎస్పీ కమలేష్ దీక్షిత్ మాట్లాడుతూ..  ‘‘మెయిన్‌పురిలో రోడ్డుపై పక్కన ఉన్న ఇంటిపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ఐదుగురు గాయపడ్డారు. ఒక ట్రక్కు వేగంగా ఇంట్లోకి దూసుకెళ్లడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో రిటైర్డ్ సబ్-ఇన్‌స్పెక్టర్, అతని భార్య మరణించారు. ట్రక్కులో ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించగా.. ఐదుగురు గాయపడ్డారు. ఒకరు ఇప్పటికీ శిథిలా కింద చిక్కుకుని ఉన్నారు’’ అని తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !