Padma Awards 2024 : 30 మంది మహిళలకు పద్మ పురస్కారాలు..

By SumaBala Bukka  |  First Published Jan 26, 2024, 12:23 PM IST

పద్మ అవార్డులలో నారీశక్తి వెల్లివిరిసింది. ఈ సారి వివిధ రంగాలకు చెందిన 30 మంది స్పూర్తిదాయకమైన మహిళలను పద్మ అవార్డులు వరించాయి. వీరిలో చాలామంది ఆయా రంగాల్లో మొట్టమొదటి మహిళలే.. 


ఢిల్లీ :  విభిన్న ప్రాంతాలు, వివిధ రంగాల నుండి 30 మంది మహిళలకు ఈసారి పద్మ అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. 

ఇందులో మొదటి మహిళా సుప్రీంకోర్టు జడ్జి ఫాతిమా బీవీ 
మొదటి ఏనుగు మాహౌట్ పర్బతి బారువా
మొదటి మహిళా హరికథా విద్వాంసురాలు ఉమా మహేశ్వరిలు కూడా ఉన్నారు.

Latest Videos

undefined

పద్మవిభూషణ్ 
వైజయంతిమాల
పద్మ సుబ్రహ్మణ్యం

పద్మభూషణ్ 
ఉషా ఉతుప్ లకు అరుదైన ఉన్నత పురస్కారాలను అందించారు

ఇక పద్మశ్రీలకు వస్తే.. 
మధుబని పెయింటర్ శాంతి దేవి పాశ్వాన్ 
పర్యావరణ కార్యకర్త చామీ ముర్ము 

జానపద గాయకులు 
గీతా రాయ్ బర్మాన్ - బెంగాల్‌కు చెందిన రాజ్‌బోన్షి జానపద 
సిల్బి పసాహ్ - మేఘాలయలోని ఖాసీ జానపదం 
ఊర్మిళా శ్రీవాస్తవ - యుపిలోని కజ్రీ జానపదం 

సాంప్రదాయ నేత కార్మికులు 
నసీమ్ బానో - లక్నోకు చెందిన చికంకారి 
తక్దీరా బేగం- వర్ధమాన్‌కు చెందిన కాంత  
స్మృతి రేఖ చక్మా - త్రిపురలోని లోయిన్‌లూమ్

వివిధ కళాత్మక కార్యకలాపాలు
రవీంద్ర సంగీతం - రెజ్వానా చౌదరి 
పంజాబీ సినిమాలు - నిర్మల్ రిషి
తోలుబొమ్మలాట - అనుపమ హోస్కెరే
ఆర్ట్ కలెక్షన్ - కిరణ్ నాడార్
ఇండాలజీ - అశ్వతీ తిరునాళ్ గౌరీ లక్ష్మీ బాయి 

మహిళా రైతులు 
అండమాన్‌కి చెందిన కె చెల్లమ్మాళ్
అరుణాచల్‌కు చెందిన యానుంగ్ జమోహ్ లెగో

వైద్యం
బర్న్స్ స్పెషలిస్ట్ ప్రేమ ధనరాజ్ 
కంటి స్పెషలిస్ట్ జి నాచియార్ 

యోగా నిపుణురాలు

షార్లెట్ చోపిన్ 
క్రీడాకారులు 
స్క్వాష్‌లో జోష్నా చినప్ప 
ఆర్చరీలో పూర్ణిమ మహతో 

సామాజిక కార్యకర్తలు 
రోడ్డు భద్రత న్యాయవాది మాయా టాండన్
 నాగా శాంతి కార్యకర్త సనో వాముజో

వ్యాపార రంగం
ఫైనాన్స్ - కల్పనా మోర్పారియా
తయారీ - శశి సోని

click me!