స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా పద్మ అవార్డుతో 10 జిల్లాలు గుర్తింపు పొందాయి. వీటిల్లో తెలంగాణలోని జనగాం, నారాయణపేట జిల్లాలు ఉన్నాయి.
ఢిల్లీ : 2024 పద్మ అవార్డులు గురువారం ప్రకటించారు. ఇందులో 132 మంది స్ఫూర్తిదాయకమైన వ్యక్తులకు పద్మశ్రీ, పద్వభూషణ్, పద్మవిభూషణ్ లు ప్రకటించారు. దీనికోసం 62,000 కంటే ఎక్కువ నామినేషన్లు వచ్చాయి. ఈ నామినేషన్లను గమనిస్తే 2014 నుండి చూస్తే 28 రెట్లు పెరిగాయి.
నామినేషన్లను అనేక రౌండ్ లలో పరిశీలించారు. 250 మంది నిపుణులతో సంప్రదింపులు చేశారు. 'ప్రభుత్వ అవార్డులను' 'పీపుల్స్ అవార్డులు'గా మార్చే విధానాన్ని కొనసాగించడానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు.
దీంట్లో భాగంగానే... ప్రతి అవార్డు గ్రహీత అందరికీ స్ఫూర్తిగా నిలవాలి. వారి పోరాటాలు, పట్టుదల, నిస్వార్థత, సేవ, శ్రేష్ఠత కథలు దేశ కథను ప్రతిబింబించాలి.
దీనికోసం ఎంపిక ఎలా చేశారంటే..
వైవిధ్యానికి మొదటి ప్రాధాన్యతనిచ్చారు. దేశం నలుమూలల నుండి, సమాజంలోనిఅన్ని విభాగాల నుండి అవార్డు గ్రహీతలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.
49 ఆక్టోజెనేరియన్లను ఎంపిక చేశారు. ఆక్టోజెనేరియన్లు అంటే 80 సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయసున్నవారు. వారి జీవితకాల సేవలు, 'ట్యాప్'ను బట్టి గుర్తించారు. వీరిలో 31 మంది 85 ఏళ్లు పైబడినవారు, 15 మంది 90 ఏళ్లు పైబడిన వారు, ముగ్గురు 100 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారిగా పద్మ అవార్డుతో 10 జిల్లాలు గుర్తింపు పొందాయి. వాటిల్లో అరుణాచల్ ప్రదేశ్ లోని తూర్పు సియాంగ్, అస్సాంలోని చిరాంగ్, ఛత్తీస్‌గఢ్ లోని నారాయణపూర్, జష్పూర్, గుజరాత్ లోని మోర్బి, కేరళలోని కాసరగోడ్, మధ్యప్రదేశ్ లోని భింద్, సిక్కింలోని మంగన్, తెలంగాణలోని జనగాం, నారాయణపేట జిల్లాలు ఉన్నాయి.
Padma Awards 2024: ‘పద్మ’ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం.. అవార్డు గ్రహీతల పూర్తి జాబితా ఇదే..
32 రాష్ట్రాల్లోని 89 జిల్లాలు -
ఐజ్వాల్ నుండి అమరావతి వరకు...
భిల్వారా నుండి బీర్భూమ్ వరకు ...
చెంగల్పట్టు నుండి చిరాంగ్ వరకు ...
దర్రాంగ్ నుండి దేవాస్ వరకు ...
తూర్పు సియాంగ్ నుండి ఎర్నాకులం వరకు ...
గంజాం నుండి గోరఖ్పూర్ వరకు ...
హిస్సార్ నుండి హైదరాబాద్ వరకు ...
జనగాం నుండి జింద్ వరకు ...
కాసరగోడ్ నుండి కోహిమా వరకు ...
లేహ్ నుండి లూధియానా వరకు ...
మోర్బి నుండి మదురై వరకు ...
పుర్బా బర్ధమాన్ నుండి పతనంతిట్ట వరకు ...
సరైకేలా ఖర్సావాన్ నుండి దక్షిణ అండమాన్ వరకు ...
ఉధంపూర్ నుండి ఉఖ్రుల్ వరకు ...
వల్సాద్ నుండి వారణాసి వరకు..
పెద్ద నగరాలను దాటి, భారతదేశంలోని నడిబొడ్డున - పురూలియా, బికనీర్, తూర్పు ఖాసీ హిల్స్, బర్గర్, కూచ్ బెహార్, దర్భంగా, తూర్పు సింగ్‌బం, గోమతి, జష్‌పూర్, కోహిమా, మీర్జాపూర్, నారాయణపూర్, పశ్చిమ త్రిపుర వరకు అన్నింటినీ కవర్ చేశారు.
రాజకీయ ద్వైపాక్షికతకే ప్రాముఖ్యతనిస్తూ.. పార్టీలు, సిద్ధాంతాలు, భౌగోళికాలకు అతీతంగా రాజకీయ అనుభవజ్ఞులను గుర్తిస్తూ.. మోడీ ప్రభుత్వం అన్నిరంగాల్లోని ప్రముఖులకు పట్టం కడుతోంది. దేశానికి సేవ చేయడమే ప్రధానమంత్రి మోడీకి ప్రధమ లక్ష్యం.
వెనుకబడిన అభ్యున్నతి కోసం పోరాడినందుకు కర్పూరీ ఠాకూర్ (జనతా పార్టీ)కి భారతరత్నతో పాటు, చిరంజీవి (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), కెప్టెన్ విజయకాంత్ (డీఎండీకే) లు కూడా అవార్డులకు ఎంపికయిన వారిలో ఉన్నారు. 2015 నుండి ప్రధాని మోదీ అవార్డుల ఎంపికలో అనుసరిస్తున్న సూత్రాన్ని ప్రతిబింబిస్తుంది.