"ఉసేన్ బోల్ట్‌ కూడా ఆశ్చర్యపోతారు": అనర్హత వేటుపై పి చిదంబరం సంచలన వ్యాఖ్యలు  

Published : Mar 28, 2023, 04:23 AM IST
"ఉసేన్ బోల్ట్‌ కూడా ఆశ్చర్యపోతారు":  అనర్హత వేటుపై పి చిదంబరం సంచలన వ్యాఖ్యలు  

సారాంశం

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడంపై ఆ పార్టీ మాజీ కేంద్ర మంత్రి , న్యాయ ప్రముఖుడు పి చిదంబరం సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు నష్టం దావాపై ఎవరైనా రెండు సంవత్సరాలు శిక్ష అనుభవించారా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. రాహుల్ ని అనర్హుడిగా ప్రకటించడంపై కాంగ్రెస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. లోక్ సభ, రాజ్యసభలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాహుల్ పై తీసుకున్న చర్యలకు నిరసనగా కాంగ్రెస్ సభ్యులు నల్ల దుస్తుల్లో పార్లమెంట్ కి హాజరయ్యారు. కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాల సభ్యులు కూడా ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు.

ఈ తరుణంలో  రాహుల్ గాంధీపై అనర్హత వేటుపై కాంగ్రెస్ మాజీ కేంద్ర మంత్రి, న్యాయ ప్రముఖుడు పి చిదంబరం స్పందించారు.  ఆయన ప్రముఖ నేషనల్ మీడియా ఎన్‌డీటీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ పరువునష్టం కేసులో ట్రయల్ కోర్టు వ్యవహరించిన వేగాన్ని చూస్తే ఉసేన్ బోల్డ్ కూడా ఆశ్చర్యపోతారని, ఆ వెంటనే రాహుల్ గాంధీని అనర్హులుగా ప్రకటించారని విమర్శించారు.

ఇప్పటి వరకు ఇలాంటి కేసుల్లో ఇదే అత్యంత కఠినమైన శిక్ష అని తాను భావిస్తున్నానని అన్నారు.  ఈ వ్యవహరాన్ని పియూష్ గోయల్ లేదా ప్రభుత్వం ఎందుకు వివరించడానికి ప్రయత్నించడం లేదని పి చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి పరువు తీసినందుకు ఇప్పటి వరకు ఎవరికైనా రెండేళ్ల శిక్ష ఎప్పుడైనా పడిందా ? అని నిలాదీశారు. చట్టాలను అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష సభ్యుడు రాహుల్ గొంతు నొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.  

విశేషమేమిటంటే.. రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు అంశంపై దాదాపు అన్ని విపక్షాలు కాంగ్రెస్‌కు అండగా నిలుస్తున్నాయి.ఈ నిర్ణయానికి నిరసనగా సోమవారం తృణమూల్ ఆకస్మిక ప్రవేశం జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య సమాన దూరం పాటిస్తామని ప్రకటించే తృణమూల్ కాంగ్రెస్ ఏంట్రీ  ప్రతిపక్ష ఐక్యత సాధించిన అరుదైన విజయాల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతుంది.

ఈ నేపథ్యంతో సోమవారం రోజున  కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కార్యాలయంలో ప్రధాన వ్యూహాత్మక సమావేశం జరిగింది, ఇందులో TMC తరపున ప్రసూన్ బెనర్జీ , జవహర్ సర్కార్ ప్రాతినిధ్యం వహించారు. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీపై పార్లమెంట్‌కు అనర్హత వేటు వేయడంపై విపక్షాల వ్యూహంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఇతర అంశాల్లో ఐక్య పోరాటానికి దూరమైనప్పటికీ .. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఏకం కావాలని కాంగ్రెస్ పేర్కొంది. 

రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా పార్లమెంట్ లో కాంగ్రెస్ ఎంపీలు నల్ల బట్టలు ధరించి నిరసన తెలిపారు. భారత రాష్ట్ర సమితి, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే)తో కలిసి "నల్ల గుడ్డ" నిరసనలో చేరింది. రాహుల్ గాంధీ క్షమాపణ కోరడంపై బిజెపిపై "సావర్కర్ కాదు" అని వ్యాఖ్యానించిన తరువాత, ఉద్ధవ్ థాకరే ఆదివారం సావర్కర్‌ను తక్కువ చేయడం వల్ల ప్రతిపక్ష కూటమిలో "చీలిక" ఏర్పడుతుందని హెచ్చరించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!