తృణమూల్ ఓ ప్రైవేట్ కంపెనీ, రాజకీయ పార్టీ కాదు: బీజేపీ సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

Published : Mar 28, 2023, 03:40 AM IST
తృణమూల్ ఓ ప్రైవేట్ కంపెనీ, రాజకీయ పార్టీ కాదు: బీజేపీ సువేందు అధికారి సంచలన వ్యాఖ్యలు

సారాంశం

కేంద్రానికి వ్యతిరేకంగా బెంగాల్ సీఎం మమతా బెనర్జీ రెండు రోజుల నిరసన దీక్ష చేయనున్నట్టు ప్రకటించారు. ఈ ప్రకటనపై పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత, బిజెపి నాయకుడు శుభేందు అధికారి  మండిపడ్డారు. MGNREGA పథకం కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల డబ్బు తీసుకుందని సువేందు అధికారి ఆరోపించారు. 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై  ప్రతిపక్ష నాయకుడు, బీజేపీ నేత సువేందు అధికారి మండిపడ్డారు. కేంద్రానికి వ్యతిరేకంగా రెండు రోజుల సమ్మె చేయాలని సీఎం మమతా బెనర్జీ పిలుపునివ్వడంపై బిజెపి నాయకుడు శుభేందు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బిజెపి నాయకుడు మాట్లాడుతూ.."టిఎంసి రాజకీయ పార్టీ కాదు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటూ విమర్శలు గుప్పించారు.

ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు, రాజవంశం, కులతత్వం , బుజ్జగింపు అనే మూడు ప్రాతిపదికన ఎన్నికలు జరిగేవని సంచలన ఆరోపణలు చేశారు. పశ్చిమ బెంగాల్, తెలంగాణలో ఇవి పాతుకుపోయాయన్నారు.

కేంద్ర ప్రాయోజిత MGNREGA పథకం కింద పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల డబ్బు తీసుకుందని అధికారి ఆరోపించారు. రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రారంభించిన సమయంలో సుమారు ₹ 3.60 కోట్ల MGNREGA జాబ్ కార్డ్ హోల్డర్లు నమోదు చేసుకున్నారని ఆయన చెప్పారు . జాబ్ కార్డులను ఆధార్‌తో అనుసంధానం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించినప్పుడు, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు కోటి జాబ్ కార్డ్ డేటాను తొలగించిందని తెలిపారు.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలలో 1 కోటి జాబ్ కార్డుల తరపున గణనీయమైన మొత్తంలో డబ్బు తీసుకుందని, అవి నకిలీవని తేలిందని,  ఇది పెద్ద కుంభకోణం అని బీజేపీ నేత అన్నారు.సాంఘిక సంక్షేమ నిధుల కేటాయింపులో “రాష్ట్రంపై కేంద్రం వివక్ష”పై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మార్చి 29 మరియు 30 తేదీల్లో రెండు రోజుల సమ్మెను ప్రకటించారు. కోల్‌కతాలోని బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించనున్నారు

PREV
click me!

Recommended Stories

ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!
Sabarimala Makarajyothi: మకర జ్యోతి దర్శనానికి శబరిమలకు పోటెత్తిన భక్తులు | Asianet News Telugu