కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు.. చేయి నరికేసి, దాచిపెట్టి.. ఓ యజమాని దారుణం...

By AN TeluguFirst Published Nov 22, 2021, 9:34 AM IST
Highlights

కోపోద్రిక్తుడైన యజమాని గణేష్ దగ్గర్లో ఉన్న పదునైన ఆయుధంతో సాకేత్  చేయి నరికేశాడు.లోపలికి తీసుకెల్లి దాచేశాడు. ఇది అక్కడే ఉన్న మిగతావారు గమనించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు యజమాని నరికేసి, దాచి పెట్టిన సాకేత్ చేయి కోసం వెతికారు. కాసేపు వెతికిన తరువాత వారికి చేయి దొరికింది. 

రేవా :  తనకు రావాల్సిన వేతన బకాయిలు ఇవ్వాలని అడిగినందుకు ఓ కూలీ చేయి నరికేశాడు ఓ కిరాతక యజమాని.  మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో శనివారం ఈ దారుణ ఘటన జరిగింది. దీనికి సంబంధించి ఆదివారం ముగ్గురిని అరెస్టు చేశారు.  ఏఎస్పీ శివ కుమార్ వర్మ వివరాల ప్రకారం… పాద్రి గ్రామానికి  చెందిన అశోక్  సాకేత్ 45 కొన్ని రోజుల క్రితం డోల్ మవూకి చెందిన  గణేష్ మిశ్రా వద్ద  నిర్మాణ పనుల్లో కూలీగా పనిచేశాడు.

అయితే, ఎన్ని రోజులవుతున్నా అతనికి రావాల్సిన Wage arrearsని మిశ్రా చెల్లించలేదు. దీంతో విసిగిపోయిన సాకేత్ తనకు రావాల్సిన వేతనం ఇవ్వాలని యజమానిని డిమాండ్ చేశాడు. ఇచ్చినప్పుడు తీసుకోవాలి కానీ.. ఇలా డిమాండ్ చేస్తారా అంటూ Owner కోపానికి వచ్చాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.  

కోపోద్రిక్తుడైన యజమాని గణేష్ దగ్గర్లో ఉన్న పదునైన ఆయుధంతో 
Saketh  చేయి నరికేశాడు. అంతటితో ఆగలేదు. అత్యంత క్రూరంగా ప్రవర్తించాడు. handని తీసుకువెళ్లి ఎక్కడో దాచిపెట్టాడు. ఇది అక్కడే ఉన్న మిగతావారు గమనించారు. ఇంత దారుణంగా వ్యవహరించడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. వెంటనే policeకు సమాచారం అందించారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని గమనించారు. ఘటనా స్థలాన్ని పరిశీలంచారు. అప్పటికే సాకేత్ తీవ్ర Bleedingతో విలవిల్లాడుతున్నాడు. 

పోలీసులు యజమాని నరికేసి, దాచి పెట్టిన సాకేత్ చేయి కోసం వెతికారు. కాసేపు వెతికిన తరువాత వారికి చేయి దొరికింది. వెంటనే దాన్ని స్వాధీనం చేసుకున్నారు.  చేయితో పాటు  సాకేత్ ను  సంజయ్ గాంధీ ఆస్పత్రికి తరలించారు. పరిస్తితి గమనించి వెంటనే చికిత్స చేసిన వైద్యులు చేతిని సాకేత్ కు అతికించారు.

యాక్సిడెంట్‌లో ‘మరణించి’.. మార్చురీలో బతికాడు.. ఉత్తరప్రదేశ్‌లో ‘మిరాకిల్’

అయితే, అప్పటికే ఎక్కువ రక్తం పోవడం కారణంగా బాధితుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో పోలీసులు ఈ దారుణానికి కారణమైన యజమాని మీద హత్యాయత్నం కింద కేసు నమోదు చేశారు. ఆ తరువాత పోలీసులు ప్రధాన నిందితుడు గణేష్ మిశ్ర, అతని సోదరులు రత్నేశ్ మిశ్ర, కృష్ణ కుమార్ మిశ్రలను అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా, ఉత్తరప్రదేశ్ లో విచిత్రం జరిగింది.. ఉత్తరప్రదేశ్ మొరదాబాద్‌లో 45 ఏళ్ల ఎలక్ట్రీషియన్‌ శ్రీకేష్‌ను వేగంగా వెళ్తున్న ఓ బైక్ గురువారం ఢీ కొట్టింది. తీవ్ర గాయాలతో నేలపై కూలిపోయాడు. వెంటనే ఆయనను సమీపంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పేషెంట్‌ను పరీక్షించారు. కానీ, అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్టు తేల్చారు. అనంతరం బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు పంపించాల్సిందిగా సూచించారు.

గురువారం రాత్రే బాడీని ప్రభుత్వ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ బాడీని అతిశీతలమైన ఫ్రీజర్‌లో భద్రపరిచారు. ఉదయం పోస్టుమార్టం జరగాల్సి ఉంది. పోలీసులు, కుటుంబ సభ్యులు ఆ హాస్పిటల్ చేరుకున్నారు. బాడీని ధ్రువీకరించి పోస్టుమార్టం కోసం అనుమతి ఇచ్చే పత్రాలపై ఆ కుటుంబం సంతకం పెట్టడానికి రెడీ అవుతున్నారు. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు బాడీలో కదలికలను గుర్తించారు. ఫ్రీజర్‌లో సుమారు ఏడు గంటలు ఉంచిన తర్వాత కూడా బాడీలో కదలికలు కనిపించాయి. 

 

click me!