'బుల్డోజర్లకు ఏమైంది?' యూపీ వైరల్ వీడియోపై మండిపడ్డ ఒవైసీ 

Published : Aug 26, 2023, 09:14 PM IST
'బుల్డోజర్లకు ఏమైంది?' యూపీ వైరల్ వీడియోపై మండిపడ్డ ఒవైసీ 

సారాంశం

మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలున్ని చెంప దెబ్బ కొట్టాలంటూ ఓ స్కూల్ టీచర్ తన విద్యార్థులకు సూచించారు. యూపీలోని ఖుబ్బాపూర్ లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి విద్యార్థిని కొట్టాలని ఇతర విద్యార్థులకు ఉపాధ్యాయుడు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఘాటుగా స్పందించారు.

మైనారిటీ వర్గానికి చెందిన ఓ బాలుడ్ని  చెంపదెబ్బ కొట్టాలంటూ ఓ స్కూల్ టీచర్ తన విద్యార్థులకు సూచించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన యూపీలోని ముజఫర్‌నగర్‌లోని మన్సూర్ పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖుబ్బాపూర్ ప్రైవేటు పాఠశాలలో చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో ఈ ఘటనపై ఏఐఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ  తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు. యూపీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వం విద్వేషాన్ని వ్యాప్తి చేస్తోందని AIMIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. ఈ మేరకు ఓవైసీ ట్విట్టర్ లో ఇలా పోస్టు చేశారు. ఇప్పుడు ఈ ఘటనపై ఎందుకు బుల్డోజర్ యాక్షన్ తీసుకోవడం లేదంటూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను  ఒవైసీ సూటిగా ప్రశ్నించారు.

ఆ ముస్లిం విద్యార్థిని తండ్రి తన కుమారుడ్ని పాఠశాల నుంచి ఉపసంహరించుకున్నాడు. అతను ఈ విషయాన్ని కొనసాగించకూడదని వ్రాతపూర్వకంగా ఇచ్చాడు. ఎందుకంటే ఈ ఘటనలో అతనికి న్యాయం జరగదని ఆ తండ్రి లేఖలో పేర్కొన్నాడని తెలిపారు. తాను ఫిర్యాదు ఇస్తే న్యాయం జరగకపోగా అది పాఠశాల వాతావరణాన్ని దెబ్బతీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. 

వీడియో వైరల్

కాగా.. ఈ వైరల్ అవుతున్న వీడియోలో విద్యార్థులతో పాటు ఇద్దరు వ్యక్తులు కూడా వీడియోలో కనిపిస్తున్నారు. రెండో తరగతి చదువుతున్న విద్యార్థినిని కొట్టాలని ట్రాప్టి త్యాగి అనే ఉపాధ్యాయుడు కోరాడు. మరొకరి ఎవరనేది తెలియడం లేదు. ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. కొన్ని గంటల్లోనే అది సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. దీనిపై పోలీసులు కూడా స్పందించారు.  

వారిలో ఒకరు టీచర్ అని, మరొకరి ఎవరనేది తెలియడం లేదని,  అతడిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రాథమిక శిక్ష అధికారి శుభమ్ శుక్లా తెలిపారు. నిందితులిద్దరిపైనా, పాఠశాల యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

బాధిత బాలుడిది, అతడిని కొట్టిన వారి మతం గురించి మీడియా అడిగినప్పుడు.. ఇంకా ఈ విషయంలో దర్యాప్తు జరుగుతోందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని తెలిపారు. తమ బృందం దీనిపై దర్యాప్తు చేస్తుందని, పోలీసులు కూడా ఈ కేసును పరిగణనలోకి తీసుకున్నారని తెలిపారు.

ఈ ఘటనపై సర్కిల్ ఆఫీసర్ రవిశంకర్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. వైరల్ వీడియోను పరిశీలించామని, పాఠశాల పని పూర్తి చేయనందుకే బాలుడిని కొట్టినట్టుగా తెలుస్తోందని చెప్పారు. ఈ వీడియోలో కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయని తెలిపారు.

ఈ విషయాన్ని పరిశీలిస్తున్నామని, తదుపరి చర్యలు తీసుకుంటామని అన్నారు. రాజకీయ పార్టీలతో పాటు అన్ని వర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తం కావడంతో, ముజఫర్‌నగర్ పోలీసులు శనివారం ఉపాధ్యాయుడిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పాఠశాలకు రాష్ట్ర విద్యాశాఖ నోటీసులు కూడా అందజేసింది.
 

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !