ఇంట్లో గొడవ.. భార్యను కారులో ఎక్కించుకుని నదిలోకి వేగంగా వెళ్లిన భర్త.. ఇద్దరూ దుర్మరణం

Published : Aug 26, 2023, 07:43 PM IST
ఇంట్లో గొడవ.. భార్యను కారులో ఎక్కించుకుని నదిలోకి వేగంగా వెళ్లిన భర్త.. ఇద్దరూ దుర్మరణం

సారాంశం

ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహ జిల్లాలో ఓ వ్యక్తి భార్యతో వెళ్లుతుండగా కారును పక్కనే ఉన్న నదిలోకి వేగంగా తీసుకెళ్లాడు. ఇంట్లో గొడవపడి ఆ వ్యక్తి బయటికి వచ్చి ఈ పని చేశాడు. ఈ ఘటనలో భార్య, భర్త ఇద్దరూ మరణించారు.  

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఓ విషాదం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన ఇంట్లో తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడు. ఆ తర్వాత భార్యను కారులో ఎక్కించుకుని వేగంగా వెళ్లాడు. కొంత దూరం వెళ్లాక రోడ్డు పక్కనే నదిలోకి కారును వేగంగా తోలుకెళ్లాడు. ఈ ఘటనలో ఇద్దరూ మరణించారు. ఈ ఘటన అమ్రోహ జిల్లాలో చోటుచేసుకుంది. 

అమ్రోహ జిల్లాకు చెందిన షాన్ ఎ ఆలమ్‌కు శుక్రవారం తన తండ్రి, ఇతర కుటుంబ సభ్యులతో ఘర్షణ జరిగింది. దీంతో ఆవేశంగా తన భార్యను కారులో ఎక్కించుకుని బయల్దేరాడు. వద్దని వారిస్తూ అడ్డుగా వచ్చిన తండ్రి, సోదరినీ పట్టించుకోలేదు. వారిని ఢీకొట్టుకుని మరీ వెళ్లిపోయాడు. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఆలమ్ తండ్రి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.

Also Read: Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు సీఎం కేసీఆర్ కంగ్రాట్స్

కొంత దూరం వెళ్లిన తర్వాత షాన్ ఎ ఆలమ్ కారును రోడ్డు పక్కనే ఉన్న నదిలోకి తీసుకెళ్లాడు. దీంతో ఇద్దరూ మరణించారు. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్‌కు చేుకుని రెస్క్యూ టీమ్స్‌ను రంగంలోకి దింపారు. శనివారం ఉదయం షాన్ ఎ ఆలమ్ డెడ్ బాడీ లభించినా.. ఆయన భార్య డెడ్ బాడీ ఇంకా లభించలేదు.

PREV
click me!

Recommended Stories

Recharge Price Hike : న్యూఇయర్ లో మీ ఫోన్ మెయింటెనెన్స్ మరింత కాస్ట్లీ.. మొబైల్ రీచార్జ్ ధరలు పెంపు..?
Indigo కు షాక్: 10 శాతం విమానాలు రద్దు.. రంగంలోకి ప్రత్యేక టీమ్ తో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు