95శాతం మంది భారతీయులకు పెట్రోలే అవసరం లేదు: యూపీ మంత్రి

By telugu teamFirst Published Oct 21, 2021, 8:38 PM IST
Highlights

దేశంలో ఫోర్ వీలర్ వాడుతూ పెట్రోల్ అవసరం ఉన్నవాళ్లు చాలా తక్కువ అని, అసలు దేశంలోని 95 శాతం మందికి పెట్రోల్ అవసరమే లేదని ఉత్తరప్రదేశ్ మంత్రి ఉపేంద్ర తివారి తెలిపారు. అందరికీ ఉచితంగా టీకాలు, కరోనా చికిత్స, డోర్ టు డోర్ మెడిసిన్స్ అందుబాటులోకి ప్రభుత్వమే తెచ్చిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ డబ్బును ఈ పన్ను రూపకంగా ప్రభుత్వం సేకరిస్తున్నదని ఇది వరకే ఓ కేంద్రమంత్రి పేర్కొన్న సంగతి తెలిసిందే.
 

లక్నో: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలపై పెద్దఎత్తున అసంతృప్తి ఉన్నది. కేవలం వాహనాల కోసమే కాదు.. ఇంధన ధరల వల్ల రవాణా ఖరీదు కావడం, తద్వారా నిత్యావసరాల ధరలూ పెరగడం.. వీటన్నింటి ప్రభావం సామాన్య ప్రజలపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే కరోనా మహమ్మారి నుంచి ఇంకా కోలుకోని సామాన్యుడిపై ఇంధన ధరల పిడుగు పడటం మరింత దెబ్బ తీస్తున్నది. ఈ ధరల కట్టడి విషయంలో మాత్రం అధికారపక్షం, అధికారపార్టీ నేతల నుంచి ఒక్కమాట రావడం లేదు. అదీకాకుండా ప్రజలకు మరింత కోపమచ్చేలా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. తాజాగా ఉత్తరప్రదేశ్ మంత్రి Petrol ధరల గురించి మాట్లాడుతూ.. దేశంలోని 95శాతం మందికి అసలు పెట్రోలే అవసరం లేదని నోరుపారేసుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లో జలాన్‌లో రాష్ట్ర మంత్రి ఉపేంద్ర తివారీ విలేకరులతో మాట్లాడారు. ఈ సమావేశంలో పెట్రోల్, Diesel Pricesపై ప్రశ్నలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ అంశంపై ఆగ్రహంగా మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరల విషయానికి వస్తే ఫోర్ వీలర్ కలిగి ఉన్న కొంత మందికే పెట్రోల్ అవసరమున్నదని అన్నారు. ప్రస్తుతం 95 శాతం మంది Indiansకి పెట్రోల్ అవసరమే లేదని వివరించారు. అంతేకాదు.. పెరిగిన ధరలను ఆయన సమర్థించే ప్రయత్నం చేశారు.

ప్రభుత్వం ఉచితంగా Coronavirus vaccineలను పంపిణీ చేస్తున్నదని, వంద కోట్ల డోసులను పంపిణీ చేసిందని మంత్రి తివారీ అన్నారు. అంతేకాదు, ఉచితంగా కరోనా చికిత్స, ఉచితంగా మందులను అందించిందని వివరించారు. ప్రతి ఇంటికి మెడిసిన్స్ సరఫరా చేసిందని పేర్కొన్నారు. ఇవన్నీ ప్రభుత్వం ఎలా భరిస్తుందని అడిగారు. అంతేకాదు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఉత్తరప్రదేశ్‌లో ఇంధన ధరలు మరీ ఎక్కువగా ఏమీ లేవని, చాలా తక్కువగానే పెరిగాయని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తలసరి ఆదాయం పెరిగిందని, వాటితో పోలిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు చాలా తక్కువ అని చెప్పారు.

Also Read: కరోనా వ్యాక్సిన్ ఫ్రీగా కావాలంటే.. పెట్రోల్ ధరలు పెరుగుతాయి...కేంద్ర మంత్రి షాకింగ్ కామెంట్స్..!

కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి కూడా ఇదే తరహాలో స్పందించారు. చమురు ధరలు అధికంగా ఏమీ లేవని, పన్నులతో అవి ఎక్కువయ్యాయని వివరించారు. మీరంతా ఉచితంగా టీకా తీసుకుని ఉంటారని, వాటికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని అడిగారు. మీరు వాటికి డబ్బులు చెల్లించలేదని, ఈ విధంగానే తాము కలెక్ట్ చేసుకుంటామని తెలిపారు.

click me!