సర్వే: కరోనా నుంచి మోడీ కాపాడగలరు.. 93 శాతం భారతీయుల నమ్మకం

By Siva KodatiFirst Published Apr 23, 2020, 8:33 PM IST
Highlights

ప్రధాని మోడీ  సమర్ధతపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆయన ఈ వైరస్ సంక్షోభం నుంచి భారతదేశాన్ని గట్టెక్కించగలరని 93.5 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. కోవిడ్ 19 ముప్పు  నుంచి దేశం సురక్షితంగా బయటపడుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌ వ్యాప్తిని, విధ్వంసాన్ని ముందుగా అంచనా వేయడంలో విఫలమైన దేశాలు ఇప్పుడు భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నాయి.

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన, బలమైన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విషయంలో ముందుచూపుతో వ్యవహరించకపోవడంతో లక్షలాది మంది అమెరికన్లు ఆసుపత్రుల పాలవ్వగా, వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి తోడు ఆర్ధిక వ్యవస్థ రోజు రోజుకి బీటలువారుతోంది.

Also Read:భారతీయ ఇంటర్నెట్ పై సర్వే.. ఆన్‌లైన్ టీచింగ్ లో సమస్యలు...

అమెరికాయే అల్లాడిపోతున్న నేపథ్యంలో భారతదేశంలో వైరస్ వ్యాప్తి చెందితే పరిస్ధితి ఏంటని చాలా మంది భయపడ్డారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ ముందుగానే అప్రమత్తమై లాక్‌డౌన్‌ను విధించారు.

ఈ క్రమంలో ప్రధాని మోడీ  సమర్ధతపై ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో ఆయన ఈ వైరస్ సంక్షోభం నుంచి భారతదేశాన్ని గట్టెక్కించగలరని 93.5 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు.

కోవిడ్ 19 ముప్పు  నుంచి దేశం సురక్షితంగా బయటపడుతుందని ప్రజలు నమ్మకంతో ఉన్నట్లు ఈ సర్వేలో తేలింది. లాక్‌డౌన్ అమలు చేసిన తొలి రోజు ప్రధాని మోడీపై 76.8 శాతం ప్రజలు విశ్వాసంతో ఉన్నారని ఐఏఎన్‌ఎస్‌- సీ ఓటర్ సర్వే పేర్కొంది.

Also Read:78 జిల్లాల్లో 14 రోజులుగా కరోనా కేసులు లేవు,వీటికి లాక్ డౌన్ ఆంక్షల ఎత్తివేత: కేంద్రం

ఏప్రిల్ 21 నాటికి ఆ సంఖ్య 93.5 శాతానికి చేరిందని ఆ సంస్థ వెల్లడించింది. ఇక కరోనా సంక్షోభాన్ని భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కోగలదా అని మార్చి 16 నుంచి ఏప్రిల్ 21 వరకు ప్రజలను సర్వే ద్వారా ప్రశ్నించారు. మొదటి రోజు 75.8 శాతంగా మంది మోడీపై విశ్వాసం ఉంచగా.. ఇది ఏప్రిల్ 21 నాటికి 89.9 శాతానికి చేరి, తర్వాత మళ్లీ పెరిగింది.

మరోవైపు భారతీయులతో పాటు వివిధ దేశాల ప్రజలు సైతం నరేంద్రమోడీ నాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. విపత్కర సమయంలో దేశాన్ని కాపాడుతూనే అంతర్జాతీయ సమాజానికి సాయం చేస్తున్నారని ప్రపంచం కొనియాడుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికే వివిధ దేశాల అధినేతలతో పోలిస్తే 75 శాతం మార్కులతో మోడీ అందరికన్నా ముందున్నారని ఓ సంస్థ చేసిన సర్వేను అమిత్ షా ట్వీట్ చేశారు. 

click me!