ఇండియాలో 5 కోట్ల మందికి హ్యాండ్ వాష్ అందుబాటులో లేదు: రిపోర్ట్

By narsimha lode  |  First Published May 21, 2020, 3:19 PM IST

భారత్ లో 5 కోట్ల మందికి పైగా అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు సరైన రీతిలో చేతులు శుభ్రపర్చుకొనే సదుపాయానికి నోచుకోలేదని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా  కరోనా నుండి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.


న్యూఢిల్లీ: భారత్ లో 5 కోట్ల మందికి పైగా అల్పాదాయ, మధ్య తరగతి ప్రజలు సరైన రీతిలో చేతులు శుభ్రపర్చుకొనే సదుపాయానికి నోచుకోలేదని ఓ అధ్యయనం తేల్చి చెప్పింది. చేతులు పరిశుభ్రం చేసుకోవడం ద్వారా  కరోనా నుండి తప్పించుకోవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

శుభ్రమైన నీరు, సబ్బు అందుబాటులో లేని అల్పాదాయ, మధ్యశ్రేణి రాబడి ఉన్న దేశాల్లోని 2 బిలియన్ ప్రజలకు కరోనా బారినపడే అవకాశం ఉందని ఈ అధ్యయనం తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ కు చెందిన  హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవల్యూషన్‌ (హెచ్‌ఎంఈ) సంస్థ అధ్యయనం చేసింది. 46 దేశాల్లో సగానికి పైగా ప్రజలకు సబ్బు, సురక్షిత నీరు అందుబాటులో లేదని ఈ అధ్యయనం తేల్చింది.

Latest Videos

undefined

also read:త్వరలోనే రైల్వే బుకింగ్ కౌంటర్లు ప్రారంభం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

 భారత్‌, పాకిస్తాన్‌, చైనా, బంగ్లాదేశ్‌, ఇథియోపియా, కాంగో, ఇండోనేషియాల్లో ప్రతి దేశంలో 5 కోట్ల మందికి సరైన హ్యాండ్‌వాషింగ్‌ సదుపాయం అందుబాటులో లేదని అంచనా వేసింది.

 హ్యాండ్‌ శానిటైజర్లు, మంచినీటి ట్యాంకర్ల సరఫరా అనేది తాత్కాలిక ఉపశమనమేనని కరోనాను ఎదుర్కొనేందుకు దీర్ఘకాలిక పరిష్కారాలు అవసరమని ఐహెచ్ఎంఈ ప్రొఫెసర్ మైఖేల్ బ్రౌర్ చెప్పారు. 
 

click me!