త్వరలోనే రైల్వే బుకింగ్ కౌంటర్లు ప్రారంభం: కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

By narsimha lode  |  First Published May 21, 2020, 2:52 PM IST

దేశంలోని 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలోనూ రేపటి నుండి రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
 



న్యూఢిల్లీ: దేశంలోని 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలోనూ రేపటి నుండి రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకొనే సౌకర్యం కల్పిస్తామని కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.

గురువారంనాడు ఆయన  మీడియాతో మాట్లాడారు. త్వరలోనే మరిన్ని రైళ్ల రాకపోకలు ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. మరో వైపు రెండు మూడు రోజుల్లో రైల్వే స్టేషన్ల టిక్కెట్టు కౌంటర్లలో బుకింగ్ కౌంటర్లు  ప్రారంభించనున్నట్టుగా ఆయన తెలిపారు. 

Latest Videos

also read:డొమెస్టిక్ ఫ్లైట్స్‌కు ఈ నెల 25 నుండి అనుమతి: ప్రయాణీకులకు సూచనలు ఇవే.....

ఈ విషయమై అన్ని రకాల చర్యలు తీసుకొంటున్నట్టుగా చెప్పారు.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు గాను  ఈ ఏడాది మార్చి చివరి వారం నుండి రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకొంది.దరిమిలా వచ్చే నెల 1వ తేదీ నుండి రైళ్ల రాకపోకలను ప్రారంభించనున్నారు. 

దరిమిలా ఇవాళ్టి నుండి రైళ్ల  టిక్కెట్లను ఆన్ లైన్ లో బుక్ చేసుకొనే అవకాశం కల్పించింది కేంద్రం.వలస కూలీలను తమ రాష్ట్రాలకు పంపేందుకు 200 శ్రామిక రైళ్లను రైల్వే శాఖ నడిపింది. 

click me!