కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం: ఆరుగురు మృతి

Published : Jan 24, 2019, 07:47 AM ISTUpdated : Jan 24, 2019, 06:10 PM IST
కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం: ఆరుగురు మృతి

సారాంశం

గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.

గురుగ్రామ్: గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కూలిన ఘటనలో ఆరుగురు మరణించారు. మరో ఇద్దరు ఇంకా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నట్లు భావిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

గురుగ్రామ్ లోని ఉల్లాస్ ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కుప్పకూలింది. ఈ సంఘటన గురువారం ఉదయం జరిగింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. శిథిలాల కింద 8 మంది చిక్కుకుపోయినట్లు అనుమానించారు. అయితే, వారి ఆరుగురు మృత్యువాత పడినట్లు తేలింది.

సంఘటన స్థలంలో ఓ బుల్ డోజర్ శిథిలాలను తొలగిస్తోంది. శిథిలాల కింద చిక్కుకున్న వారి ఆచూకీని కనిపెట్టడానికి హర్యానా ఫైర్ సర్వీస్ అధికారులు రంగంలోకి దిగారు. 

భవనం కూలడానికి గల కారణమేమిటనేది తెలియడం లేదని సహాయక చర్యలు చేపట్టిన సిబ్బంది అంటున్నారు. ప్రసిద్ధమైన సైబర్ హబ్ కు ఈ భవనం 12 కిలోమీటర్ల దూరంలో ఉంది.

PREV
click me!

Recommended Stories

BRICS: బ్రిక్స్ సదస్సులో మోదీ వరుస భేటీలు.. దేశ భ‌విష్య‌త్తును మార్చే ఒప్పందాలు
BRICS: బ్రిక్స్ స‌ద‌స్సులో న్యూఢిల్లీ డిక్ల‌రేష‌న్‌కు ఆమోదం.. అస‌లేంటి డిక్ల‌రేష‌న్‌.?