గాలివాన బీభత్సం: పిడుగుపాట్లకు 33 మంది దుర్మరణం

First Published May 29, 2018, 11:01 AM IST
Highlights

త్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన గాలివాన సోమవారం బీభత్సం సృష్టించింది.

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన గాలివాన సోమవారం బీభత్సం సృష్టించింది. పిడుగులు పడి 30 మందికి పైగా మృత్యువాత పడ్డారు.

జాతీయ మీడియాలో వచ్చిన వార్తాకథనాల ప్రకారం - బీహార్ లో 18 మంది, జార్ఖండ్ లో 13 మంది, ఉత్తరప్రదేశ్ లో 9 మంది పిడుగులు పడి మరణించారు. 

బీహార్ లోని గయాలో నలుగురు, ముంగేర్ లో ముగ్గురు, ఔరంగాబాదులో ఐదుగురు, నవాడాలో ఇద్దరు మరణించారు. బీహార్ లోని కతిహార్ పేఖా గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. 

జార్ఖండ్ లోని రాంచీలో ముగ్గురు మరణించగా, 28 మందికి పైగా గాయపడ్డారు. వర్షం, ఉరుముల వల్ల ఆ ప్రాంతంలో కరెంట్ సరఫరాకు, నీటి సరఫరాకు అంతరాయం కలిగింది. 

click me!