PM Modi in Denmark: భాషలు ఏదైనా.. మన సంస్కృతి భారతీయమే: ప్ర‌ధాని మోడీ

Published : May 04, 2022, 01:41 AM IST
 PM Modi in Denmark: భాషలు ఏదైనా.. మన సంస్కృతి భారతీయమే:  ప్ర‌ధాని మోడీ

సారాంశం

PM Modi in Denmark: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ పర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ ప్రవాసులతో మాట్లాడుతూ..  సమ్మిళితతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఉద్బోధించారు. భాష ఏదైనా సరే మన సంస్కృతి భారతీయమే అన్నారు.  

PM Modi in Denmark:  ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం డెన్మార్క్‌లోని కోపెన్‌హాగన్ పర్య‌టిస్తున్నారు. ఈ సందర్భంగా భారతీయ ప్రవాసులతో సంభాషించారు. తన ప్రసంగంలో సమ్మిళితతను, సాంస్కృతిక వైవిధ్యాన్ని ఉద్బోధించారు. భాష ఏదైనా సరే మన సంస్కృతి భారతీయమే అన్నారు.సమగ్రత మరియు సాంస్కృతిక వైవిధ్యం భారత దేశం బ‌ల‌మ‌ని, తాము 'వసుధైవ కుటుంబం'-ఒకే ప్రపంచాన్ని విశ్వసిస్తామని ప్రధాని మోదీ అన్నారు.

భారతదేశ విస్తారమైన వైవిధ్యం కారణంగా..  ప్రజలు వేర్వేరు ఆహార ఎంపికలు,  భాషలను కలిగి ఉండవచ్చు, కానీ భారతీయులంతా ఒకే సంస్కృతిని కలిగి ఉంటారని ఆయన పేర్కొన్నారు. దేశాన్ని రక్షించడానికి, తాము కలిసి నిలబడతామని ఆయన చెప్పారు.

మూడు దేశాల యూరప్ పర్యటనలో భాగంగా రెండో విడతలో భాగంగా డెన్మార్క్‌కు చేరుకున్న ప్రధాని మోదీ, నేడు భారతదేశం ఏదైతే సాధిస్తుందో.. అది మానవాళిలో ఐదవ వంతు సాధించిన విజయమని అన్నారు.

అలాగే..  ప్రధాని మోదీ తన ప్రసంగంలో వాతావరణ మార్పు, పర్యావరణం, గ్రీన్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్ గురించి కూడా మాట్లాడారు.  వాతావరణ మార్పులను పరిష్కరించడానికి లైఫ్- లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్‌పై దృష్టి పెట్టాలని చెప్పాడు. వినియోగాన్ని దృష్టిలో ఉంచుకునే విధానానికి స్వస్తి చెప్పాలని,  మన అవసరాలను బట్టి నిర్ణయించాలని ఆయన అన్నారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu