
Yediyurappa Backs Basavaraj Bommai| వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కర్ణాటక బీజేపీలో నాయకత్వ మార్పుపై జరుగుతుందనే చర్చ జోరుగా సాగింది. ఈ ఊహాగానాలన్నింటికి చెక్ పెట్టారు బీజేపీ కర్ణాటక అగ్రనేత బీఎస్ యెడియూరప్ప. నాయకత్వ మార్పు ప్రసక్తే లేదని బీజేపీ కర్ణాటక అగ్రనేత బీఎస్ యెడియూరప్ప స్పష్టం చేశారు. ప్రస్తుత సీఎం బస్వరాజు బొమ్మె పనితీరును ప్రశంసనీయం. తనకు తెలిసినంత వరకు రాష్ట్రంలో సీఎం మార్పు ఊసే లేదని పేర్కొన్నారు.
గత కొన్ని రోజులుగా..బొమ్మై స్థానంలో నూతన వ్యక్తికి నాయకత్వ బాధ్యతలు అప్పగించనున్నట్టు భారీ ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. బెంగళూరులోని బసవేశ్వర సర్కిల్‌లో 12వ శతాబ్ది కవి- లింగాయత్ సాధువు బసవన్న విగ్రహాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆవిష్కరించినప్పటి నుంచి ఈ చర్చ మరింత ఊపు అందుకుంది.
బీజేపీ ఇటీవల ఎన్నికలకు వెళ్లే రాష్ట్రాల అగ్ర నాయకత్వంలో మార్పులు చేసింది. ముఖ్యంగా ఉత్తరాఖండ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజల మద్దతు కూడగట్టడంలో విఫలం అయ్యారన్న అభిప్రాయం మేరకు ముఖ్యమంత్రులను మార్చివేసింది. ఈ ఏడాది ప్రారంభంలో ఉత్తరాఖండ్‌లో ఎన్నికలు జరిగాయి, ఇందులో బీజేపీ మరోసారి అధికారంలోకి వచ్చింది. గుజరాత్‌లో ఏడాది చివరి నాటికి ఎన్నికలు జరగనున్నాయి.
గతేడాది బీఎస్ యెడియూరప్ప స్థానంలో బసవరాజు బొమ్మై.. కర్ణాటక సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అయితే.. పార్టీ అనుభవజ్ఞుడు యెడియూరప్ప ఆ ప్రభుత్వానికి మెంటర్ స్థానంలో ఉన్నారు. నాటి నుంచి బొమ్మై సర్కార్ పలు వివాదాల్లో చిక్కుకున్నది. తొలుత హిజాబ్ వివాదం.. ముస్లిం వ్యాపారులను నిషేధించాలని రైట్ వింగ్ గ్రూపులు చేసిన పిలుపుతో సహా అనేక వివాదాలతో ప్రభుత్వం దెబ్బతింది.
మతోన్మాద సమస్యలపై మౌనం పాటిస్తున్నందుకు బసవరాజ్ బొమ్మై అన్ని వర్గాల నుండి విమర్శించబడ్డారు, మరియు మితవాద సంస్థలు తీసుకున్న నిర్ణయాలు మరియు ఆదేశాలు జారీ చేయబడ్డాయి. ఒక కాంట్రాక్టర్ ఆత్మహత్య విషయమై బొమ్మై క్యాబినెట్‌లో మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై వచ్చిన ముడుపుల ఆరోపణలు పెద్ద వివాదానికి దారి తీశాయి. దీంతో కేఎస్ ఈశ్వరప్పను సీఎం బొమ్మై పక్కకు తప్పించారు.