ఇక మన ఆసుపత్రులు మరింత సమర్థవంతం.. ప్రధాని మోడీ

By AN TeluguFirst Published Oct 7, 2021, 2:39 PM IST
Highlights

ఉత్తరాఖండ్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రిషికేశ్‌లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో PM CARES కింద ఏర్పాటు చేసిన 35 ప్రెజర్ స్వింగ్ యాడ్సోర్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్‌లను కూడా PM ప్రారంభించారు.

న్యూఢిల్లీ : మన ఆసుపత్రులు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం అన్నారు. అక్టోబర్ 7న దేశవ్యాప్తంగా 4000 కొత్త ఆక్సిజన్ ప్లాంట్లను పిఎమ్ కేర్స్ ఫండ్ కింద ఎస్టాబ్లిష్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ఈ విధంగా స్పందించారు. 

ఉత్తరాఖండ్‌లోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) రిషికేశ్‌లో జరిగిన కార్యక్రమంలో 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో PM CARES కింద ఏర్పాటు చేసిన 35 ప్రెజర్ స్వింగ్ యాడ్సోర్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్‌లను కూడా PM ప్రారంభించారు.

"దీనితో, దేశంలోని అన్ని జిల్లాలు ఇప్పుడు PSA ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించాయి" అని ప్రధాన మంత్రి కార్యాలయం తెలిపింది. PMO ప్రకారం, దేశవ్యాప్తంగా మొత్తం 1,224 PSA ఆక్సిజన్ ప్లాంట్లకు ప్రధాని సహాయనిధి ఫండ్ కింద నిధులు సమకూర్చబడ్డాయి. వీటిలో 1,100 కి పైగా ప్లాంట్లు ప్రతిరోజూ 1,750 MT ఆక్సిజన్ ఉత్పత్తిని అందిస్తాయి.

స్వల్ప వ్యవధిలో కోవిడ్ -19 తో పోరాడే సదుపాయాలను సమకూర్చడంలో భారతదేశ సామర్థ్యాన్ని ప్రధాని ప్రశంసించారు. దిగుమతి చేసుకునే స్థాయి నుంచి దేశం ఎగుమతిచేసే స్థాయికి చేరిందని, ఎక్స్ పోర్టర్ గా ముందుకు సాగుతోందని అన్నారు. "ఇంత తక్కువ సమయంలో, దేశంలో అందుబాటులోకి వచ్చిన సౌకర్యాలు దేశ సామర్థ్యాన్ని చూపుతున్నాయన్నారు. ఒక్క టెస్టింగ్ ల్యాబ్ ఉన్న పరిస్థితుల నుంచి 3,000 టెస్టింగ్ ల్యాబ్‌ల నెట్‌వర్క్ ఏర్పాటు వరకు, మాస్క్‌లు,  కిట్‌ల దిగుమతి నుండి దాని తయారీ వరకు, భారతదేశం త్వరితగతిన ఎగుమతిదారుగా ముందుకు సాగుతోంది ”అని మోదీ అన్నారు.

జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టుల ఘాతుకం: ఇద్దరు టీచర్లను కాల్చి చంపిన టెర్రరిస్టులు

ఇంకా, "CoWIN platform ఏర్పాటు చేయడం ద్వారా.. ఇంత పెద్ద స్థాయిలో వ్యాక్సినేషన్ ఎలా జరుగుతుందో.. భారత్ మొత్తం ప్రపంచానికి మార్గనిర్దేశనం చేసింది" ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి, గవర్నర్ గుర్మిత్ సింగ్, కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వీరంతా దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను పెంచడంలో మోదీ కృషిని ప్రశంసించారు.

గురువారం తన పర్యటనకు ముందు, PM మోడీ బుధవారం ట్వీట్ చేశారు, "రేపు, అక్టోబర్ 7న నేను దేవభూమి ఉత్తరాఖండ్‌లో ఉంటాను. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 35 PSA ఆక్సిజన్ ప్లాంట్లు దేశానికి అంకితం చేయబోతున్నాం. ఇది విస్తృత స్థాయిలో ప్రజా ప్రయోజనం, కీలకమైన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు కిందికి వస్తుంది" అని ట్వీట్ చేశారు. 
 

click me!