ప్రతిపక్షాల ఐక్యత వల్ల 2024 ఎన్నికల్లో ఎలాంటి లాభమూ ఉండదు - గులాం నబీ ఆజాద్

Published : Jun 15, 2023, 10:40 AM IST
ప్రతిపక్షాల ఐక్యత వల్ల 2024 ఎన్నికల్లో ఎలాంటి లాభమూ ఉండదు -  గులాం నబీ ఆజాద్

సారాంశం

ప్రతిపక్షాలన్నీ కలిసి పోవడం వల్ల 2024 ఎన్నికల్లో ఎలాంటి లాభాన్ని చేకూర్చదని కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ అన్నారు. కొన్ని ప్రాంతీయ పార్టీలకు ఆయా రాష్ట్రాల్లో తప్ప మరే రాష్ట్రంలోనూ ఎమ్మెల్యేలు లేరని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పొత్తుల అంశం పెద్దగా కలిసిరాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

వచ్చే ఏడాది జరగనున్న లోక్ సభ ఎన్నికలకు ముందు డెమొక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ (డీపీఏపీ) చీఫ్, కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ ప్రతిపక్షాల ఐక్యతపై మాట్లాడారు. విపక్షాల ఐక్యత వల్ల ప్రయోజనం కలుగుతుందని తనకు అనిపించడం లేదని అన్నారు. ఎందుకంటే ఇరుపక్షాలు ఒకరికొకరు చెప్పుకోవడానికి ఏమీ లేవని అన్నారు. ‘‘ఇరుపక్షాలకు ఏదో ఒకటి ఉంటేనే ప్రతిపక్షాల ఐక్యతకు ప్రయోజనం చేకూరుతుంది. రెండింటికీ ప్రయోజనాల వాటాలో వ్యత్యాసం ఉండవచ్చు. ఇది 50-50 లేదా 60-40 కావచ్చు. కానీ ఈ సందర్భంలో ఇరు పక్షాలు ఒకరికొకరు ఇవ్వడానికి ఏమీ లేదు’’ అని ఆయన అన్నారు.

'తిత్లీ ఉడి' పాడిన గొంతు ఇక లేదు.. ప్రముఖ సింగర్ శారద కన్నుమూత..

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఏర్పాటు చేసిన ప్రతిపక్షాల సమావేశంపై గులాం ఆజాద్ మాట్లాడుతూ.. ఈ సమావేశానికి తనకు ఆహ్వానం అందలేదని అన్నారు. పశ్చిమ బెంగాల్ గురించి ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్, సీపీఎంలకు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేరని, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)తో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీకి ఒరిగేదేంటని ఆజాద్ ప్రశ్నించారు. ‘‘మమతా బెనర్జీ ఎందుకు పొత్తు పెట్టుకున్నారు? దాని వల్ల ఆమెకు కలిగే ప్రయోజనం ఏమిటి? అలాగే రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లలో టీఎంసీకి ఎమ్మెల్యేలు లేరు. ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఆమెకు ఏం ఇస్తుంది? ఏమీ లేదు’’ అని ఆయన అన్నారు.

మరో పడవ బోల్తా.. నీట మునిగి 79 మంది మృతి.. పలువురు గల్లంతు

అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు ఒక్క శాసనసభ్యుడు కూడా లేరని, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీకి ఏపీలో తప్ప మరే దక్షిణాది రాష్ట్రంలో ఎమ్మెల్యేలు లేరని గుర్తు చేశారు. జగన్ మోహన్ రెడ్డికి కాంగ్రెస్ ఏం ఇస్తుందని, కాంగ్రెస్ పార్టీకి ఆయన ఏం ఇస్తారని ప్రశ్నించారు.ప్రతిపక్ష ఐక్యత అనేది ఫొటోలు దిగేందుకు అవకాశం తప్పా.. మరొకటి కాదని అన్నారు. 

అయితే వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీని ఓడించడానికి ప్రతిపక్షాలు ఏకం కావాలని తాను కోరుకుంటున్నట్లు గులాం నబీ ఆజాద్ స్పష్టం చేశారు. కానీ దురదృష్టవశాత్తూ ప్రతి ప్రతిపక్ష పార్టీకి సొంత రాష్ట్రాల్లో తప్ప వేరే చోట ఏమీ లేదని అన్నారు. రాష్ట్రాల్లో రెండు మూడు పార్టీలు (కూటమిగా) ప్రభుత్వాలను ఏర్పాటు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పొత్తు ఉన్నా, ఎన్నికల అనంతర పొత్తు ఉన్నా తేడా ఉండదన్నారు. ఎన్నికలకు ముందు పొత్తుతో పాటు ఎన్నికల అనంతర పొత్తులోనూ అంతే సీట్లు వస్తాయని అన్నారు. ఎన్నికల అనంతర పరిస్థితుల్లో పొత్తుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెప్పారు.

దారుణం.. పశువులను తరలిస్తున్న వ్యక్తిని కొట్టి చంపిన గోరక్షకులు..

ఎన్నికలకు ముందు కూటమిలో ప్రతిపక్షాలు 300 సీట్లు గెలిస్తే.. పొత్తు లేకపోయినా అంతే సంఖ్యలో సీట్లు వస్తాయని గులాం నబీ ఆజాద్ అన్నారు. వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఇటీవలి ఎన్నికల్లో సాధించిన విజయాలకు ఆ పార్టీ నాయకత్వమే కారణమని ఆయన కొనియాడారు. కాంగ్రెస్ కు కేంద్రంలో కలిసిరాలేదని, కానీ రాష్ట్రాల్లో బాగానే ఉందని తెలిపారు. ‘‘బలమైన రాష్ట్ర నాయకత్వం ఉన్న చోట పార్టీ పుంజుకుంటోంది. ఒకే ఒక్క తేడా ఏంటంటే గతంలో కేంద్ర నాయకత్వం రాష్ట్రాలను నడిపించేది, ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వాన్ని నడుపుతోంది.’’ అని అన్నారు. 

కాగా.. జమ్మూ ప్రాంతంలోని దోడా జిల్లాలో భూకంపం కారణంగా జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. గుండోహ్, భదేర్వా తహసీళ్లలో కొన్ని పాఠశాలలు, ఆసుపత్రులు, ఇళ్లు దెబ్బతిన్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. ఇది ఆందోళన కలిగించే అంశమని. ఇకపై ప్రకంపనలు ఉండవని ఆశిస్తున్నామని చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్