ప్ర‌తిప‌క్షాలకు మోడీ ఫోబియా ప‌ట్టుకుంది - కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ

By team teluguFirst Published Aug 13, 2022, 3:34 PM IST
Highlights

విపక్లాల నుంచి ఇప్పుడే రెండు డజన్లకు పైగా ప్రధాన మంత్రి అభ్యర్థులు రెడీగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ అన్నారు. ప్రతిపక్షాలకు మోడీ ఫోబియా పట్టుకుందని తెలిపారు. యూపీలోని రాంపూర్ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

బీహార్ లో ఎన్డీఏ కూట‌మి కూలిపోయి మహాకూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే విపక్షాల నుంచి ప్రధాని అభ్యర్థిత్వంపై చర్చ జోరందుకుంది. మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో కొందరు మమతా బెనర్జీని ప్రధానమంత్రి పదవి క్యాండియేట్ గా చూస్తుంటే, మ‌రి కొంద‌రు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అభ్య‌ర్థి అవుతార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ విపక్షాలను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు.

రూ. 20 కోసం రైల్వేపై 20 ఏళ్ల పోరాటం.. కేసు గెలిచిన లాయర్‌కు వడ్డీతో సహా డబ్బులు

రాంపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో నఖ్వీ మాట్లాడారు. మోదీ ఫోబియా అనే రాజకీయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు త్వరలో అదృశ్యమవుతారని అన్నారు. ప్రధానమంత్రి పదవి ఖాళీగా లేన‌ప్ప‌టికీ ప్రతిపక్షాలు రెండు డజన్ల మంది అభ్యర్థులతో వెయిటింగ్ లిస్ట్‌ను సిద్ధం చేశాయ‌ని అన్నారు. 

ప్రతిపక్షంలో నిరాశావాద రాజకీయ ఆటగాళ్లు ఉన్నారని నఖ్వీ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కఠోర శ్రమ, చిత్తశుద్ధితో తాము ఎప్పటికీ పోటీపడలేమని అన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌పై విరుచుకుప‌డుతూ.. విప‌క్షాలు ఇప్పటికే రెండు డజన్ల మంది ప్రధానమంత్రి అభ్యర్థులతో కూడిన వెయిటింగ్ లిస్ట్‌ను సిద్ధం చేశాయని ఎద్దేవా చేశారు. వానిటీ వితౌట్ వేకెన్సీ అంటారని ఆయ‌న అన్నారు.

బీజేపీ ముఖ్య సంస్థ‌లుగా కేంద్ర ద‌ర్యాప్తు ఏజెన్సీలు అంటూ టీఎంసీ విమ‌ర్శ‌లు

రాజకీయ అసహనం, బూటకపు కల్పిత ఆరోపణలు ఉన్న‌ప్ప‌టికీ దేశ భద్రతా జాతీయ విధానం, సమిష్టి సాధికారత ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నిబద్ధతతో అవిశ్రాంతంగా, శ్రద్ధగా పనిచేస్తున్నారని తెలిపారు. ప్రధానికి దేశ భద్రత, గౌరవమే ‘జాతీయ విధానం’ అని కొనియాడారు. ఆయ‌న నిరుపేద సంక్షేమమే ‘రాష్ట్రధర్మం’ అని చెప్పారు.

Salman Rushdie: అందుకే సల్మాన్ రష్దీ పుస్తకాన్ని బ్యాన్ చేశాం.. రష్దీ అద్భుత రచయిత: కేంద్ర మాజీ మంత్రి నట్వర్

ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ పర్యటనలో భాగంగా మహాత్మాగాంధీ స్టేడియంలో 75 గాలిపటాలను ఎగుర‌వేసే ‘తిరంగా కైట్ ప్రోగ్రామ్’ లో ఆయన పాల్గొన్నారు. అనంతరం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం తండాలో బహుళార్ధసాధక భవనం (ఉమెన్స్ హెల్త్ కేర్, స్పోర్ట్స్ గ్రౌండ్, అమృత్ సరోవర్) ను కూడా నఖ్వీ ప్రారంభించారు. అలాగే యూపీ ఉద్యోగ్ వ్యాపార్ ప్రతినిధి మండల్ కార్యాలయాన్ని కూడా ఆయన ప్రారంభించారు.
 

click me!